Share News

Suryapet: ఏసీబీకి చిక్కిన సూర్యాపేట ఇన్‌చార్జి డీఎఫ్‌వో

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:47 AM

రూ.25 వేల లంచం సొమ్ముతో సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జి మత్స్యశాఖ అధికారి(డీఎ్‌ఫవో) రూపేందర్‌సింగ్‌ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు.

Suryapet: ఏసీబీకి చిక్కిన సూర్యాపేట ఇన్‌చార్జి డీఎఫ్‌వో

భానుపురి, జూలై 19: రూ.25 వేల లంచం సొమ్ముతో సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జి మత్స్యశాఖ అధికారి(డీఎ్‌ఫవో) రూపేందర్‌సింగ్‌ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఏసీబీ నల్లగొండ డీఎస్పీ జగదీశ్‌చందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చేపలు పట్టుకునేందుకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు రూపేందర్‌ లంచం డిమాండ్‌ చేస్తున్నారని సూర్యాపేటకు చెందిన ఓ వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు.


సమాచారం మేరకు శుక్రవారం సూర్యాపేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం బాధ్యులు రూపేందర్‌ ఇంటికి వెళ్లి రూ.25 వేలు ఇచ్చి బయటకు వస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఇంట్లోకి వెళ్లి సోదాలు చేసి ఆ డబ్బును పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు రూపేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, 2016లో నిజామాబాద్‌లో రూ.5 వేలు లంచం తీసుకుంటూ రూపేందర్‌ ఏసీబీకి పట్టుబడ్డారు.

Updated Date - Jul 20 , 2024 | 07:03 AM