Share News

Hyderabad: పుష్ప-2 హీరో, ప్రొడక్షన్‌ టీం, థియేటర్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..

ABN , Publish Date - Dec 21 , 2024 | 01:53 PM

ప్రచార మోజులో మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైన పుష్ప-2 హీరో అల్లు అర్జున్‌(Pushpa-2 hero Allu Arjun), ప్రొడక్షన్‌ టీం, సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ)కి బీసీ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ యుగంధర్‌ ఫిర్యాదు చేశారు.

Hyderabad: పుష్ప-2 హీరో, ప్రొడక్షన్‌ టీం, థియేటర్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..

- ఎన్‌హెచ్‌ఆర్సీకి బీసీ పొలిటికల్‌ జేఏసీ ఫిర్యాదు

హైదరాబాద్: ప్రచార మోజులో మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైన పుష్ప-2 హీరో అల్లు అర్జున్‌(Pushpa-2 hero Allu Arjun), ప్రొడక్షన్‌ టీం, సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ)కి బీసీ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ యుగంధర్‌ ఫిర్యాదు చేశారు. శుక్రవారం, ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఆర్సీ కార్యాలయం(NHRC Office)లో ఫిర్యాదు చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: టార్గెట్‌ న్యూ ఇయర్‌ వేడుకలు.. ముంబై నుంచి నగరానికి ఎండీఎంఏ డ్రగ్స్‌


city9.jpg

సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా అల్లు అర్జున్‌(Allu Arjun) దుష్ప్రవర్తన, నిర్లక్ష్యం కారణంగా మానవ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లిందన్నారు. ప్రేక్షకులను కంట్రోల్‌ చేయలేమని పోలీసులు హెచ్చరించినా నటుడు అల్లు అర్జున్‌ వచ్చారని, ఫలితంగా ఓ మహిళ ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఆమె కుమారుడు శ్రీతేజ చావుబతుకుల మధ్య ఉన్నాడని కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ఘటన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 లోని జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందన్నారు. అందువల్ల పుష్ప-2 హీరో, ప్రొడక్షన్‌ టీం, థియేటర్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరినట్లు తెలిపారు. సినిమా లాభాల్లో మరణించిన మహిళ కుటుంబానికి 10 శాతం వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు

ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2024 | 01:53 PM