Share News

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Sep 24 , 2024 | 10:54 PM

నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజల రక్షణ కోసం పాటుపడాలని రామగుండం సీపీ శ్రీని వాస్‌ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

భీమిని, సెప్టెంబరు 24: నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజల రక్షణ కోసం పాటుపడాలని రామగుండం సీపీ శ్రీని వాస్‌ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో రిపెప్షన్‌ కౌంటర్‌, రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదుదారు లతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజారక్షణ కోసం పాటుపడాలన్నా రు. పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ సిబ్బంది కొరత లేకుండా చర్య లు తీసుకుంటామన్నారు. సీఐ కుమార స్వామి, ఎస్సై విజయ్‌ కుమార్‌, ఏఎస్సై తిరుపతి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

కన్నెపల్లి: కన్నెపల్లి పోలీస్‌స్టేషన్‌ను సీపీ శ్రీనివాస్‌ తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ పరిస రాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డుల ను తనిఖీ చేశారు. సిబ్బంది వివరా లు, విధుల పనితీరు, స్టేషన్‌ భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఆయ న మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధి తుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి న్యాయం చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. యువతను క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్ర మాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు. తాండూర్‌ సీఐ కుమారస్వామి, ఎస్‌ఐలు సౌ జన్య, కిరణ్‌, విజయ్‌కుమార్‌, గంగారాం పాల్గొన్నారు.

తాండూర్‌: బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలని సీపీ శ్రీనివాస్‌ పోలీస్‌ సిబ్బందికి సూ చించారు. తాండూర్‌, మాదారం పోలీస్‌స్టేషన్‌లను తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. గ్రామాల్లో రౌడీషీటర్స్‌, కేడీలు, డీసీలు, సస్పెక్ట్‌షీట్స్‌ల ఇళ్లను తనిఖీ చేయాలన్నారు. సీఐ కుమా రస్వామి, ఎస్సైలు కిరణ్‌ కుమార్‌, సౌజన్య ఉన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 10:54 PM