Share News

ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తాం

ABN , Publish Date - Nov 01 , 2024 | 11:12 PM

ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి క్యాంపు కార్యాయలంలో కాసిపేట మండలానికి చెందిన 17 దండారీ గ్రూపులకు ఒక్కో గ్రూపుకు రూ. 15 వేల చెక్కులను అందజేసి మాట్లాడారు.

ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తాం

బెల్లంపల్లిరూరల్‌/తాండూరు/కాసిపేట, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి క్యాంపు కార్యాయలంలో కాసిపేట మండలానికి చెందిన 17 దండారీ గ్రూపులకు ఒక్కో గ్రూపుకు రూ. 15 వేల చెక్కులను అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. డీటీడీవో మడావి గంగారం, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్‌, ఆదివాసీ నాయకులు ఆడె జంగు, సోయం సూరు, ఆత్రం జంగు, గ్రామ పటేల్‌లు, దండారీ నిర్వహకులు పాల్గొన్నారు.

ఇందిర మహిళ శక్తి క్యాంటీన్‌కు భూమి పూజ

బెల్లంపల్లిరూరల్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : బెల్లంపల్లి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ఇందిర మహిళ శక్తి క్యాంటీన్‌ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ మహిళ సంఘాల ద్వారా నడిచే క్యాంటీన్‌ ద్వారా సంఘాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రభుత్వ మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపడుతుందని పేర్కొన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, కమీషనర్‌ శ్రీనివాసరావు,కౌన్సిలర్‌లు,ఆర్‌పీలు , మహిళ సంఘాల సబ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2024 | 11:12 PM