Hyderabad: కార్మికుల వైద్య పరీక్షల్లో గోల్‌మాల్: సీపీఎం
ABN , Publish Date - Jul 09 , 2024 | 01:55 AM
రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్య పరీక్షల పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని సీపీఎం ఆరోపించింది. ఎలాంటి టెండర్లు లేకుండానే గత ప్రభుత్వం ముంబైకి చెందిన సీఎ్‌ససీ హెల్త్‌కేర్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చిందని పేర్కొంది.
హైదరాబాద్, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్య పరీక్షల పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని సీపీఎం ఆరోపించింది. ఎలాంటి టెండర్లు లేకుండానే గత ప్రభుత్వం ముంబైకి చెందిన సీఎ్‌ససీ హెల్త్‌కేర్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చిందని పేర్కొంది. ఆరోగ్య పరీక్షలను నిర్వహించే ఏజెన్సీని మార్చి.. కార్మికుల సొమ్మును కాపాడాలని సీపీఎం హైదరాబాద్ నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2022లో సీఎ్‌ససీ సంస్థతో ఒప్పందం చేసుకున్నాయన్నారు.
ఒక్కో కార్మికుడికి పరీక్షల కోసం రూ.3256 చొప్పున చెల్లించేలా ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. దొంగ లెక్కలతో నిధులను కాజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే 11 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు లెక్కలు చెబుతున్నారన్నారు. స్థానికంగా ఉన్న డయాగ్నస్టిక్స్ సంస్థలను పక్కన పెట్టి ముంబైసంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ దోపిడీని అడ్డుకొని, ఏజెన్సీని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.