Allu Arjun Arrest: హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్
ABN , Publish Date - Dec 13 , 2024 | 02:17 PM
Allu Arjun: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో నిందితుడిగా ఉన్న బన్నీని చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో నిందితుడిగా ఉన్న బన్నీని చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయన్ను విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్. కేసును కొట్టి వేయాలని కోరుతూ కోర్టులో ఆల్రెడీ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన తరఫు న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్‌గా విచారించాలని కోర్టును కోరారు.
లంచ్ మోషన్‌పై తేలుస్తారా?
క్వాష్ పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకు మాత్రమే మెన్షన్ చేయాలని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. అయితే బుధవారం నాడే పిటిషన్ ఫైల్ చేశామని, దీన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు బన్నీ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని చెప్పింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది కోరారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులను అడిగి 2.30కి చెబుతానని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
Also Read:
అల్లు అర్జున్ అరెస్ట్.. నెక్ట్స్ జరిగేదిదే..
అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు..
అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్ రియాక్షన్
For More Telangana And Telugu News