Share News

Allu Arjun Release: అల్లు అర్జున్ అరెస్ట్‌కు కారణం ఆ ఒక్క తప్పే.. అక్కడే బుక్కయ్యారు

ABN , Publish Date - Dec 14 , 2024 | 09:28 AM

Allu Arjun Release: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ మీద ఆయన రిలీజ్ అయ్యారు. జైలు నుంచి నేరుగా గీతాఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లిన బన్నీ.. ఆ తర్వాత ఇంటికి బయల్దేరారు.

Allu Arjun Release: అల్లు అర్జున్ అరెస్ట్‌కు కారణం ఆ ఒక్క తప్పే.. అక్కడే బుక్కయ్యారు
Allu Arjun

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘పుష్ప 2’ మూవీతో డబుల్ బ్లాక్‌బస్టర్‌ కొట్టి పాన్ ఇండియా రేంజ్‌లో హల్‌చల్ చేసిన బన్నీ అరెస్ట్ అవడం సెన్సేషన్‌గా మారింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ అంశం మీదే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఎట్టకేలకు అల్లు అర్జున్ విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ మీద చంచల్‌గూడ జైలు నుంచి రిలీజైన బన్నీ.. ఇంటికి కాకుండా నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లారు. అయితే గత 24 గంటల్లో అరెస్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు జరిగిన విషయాలపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు పుష్ప అరెస్ట్‌కు కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..


రేవంత్ ఏం అన్నారంటే..

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఈ కేసులో కీలక అంశాలుగా ఉన్నాయి. డిసెంబర్ 4న ఆయన సినిమా చూసి, వెళ్లిపోయి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదన్నారు రేవంత్. కానీ థియేటర్ దగ్గర కారు టాప్ నుంచి పైకి లేచి.. ఫ్యాన్స్‌కు నమస్కారం పెట్టి, అభివాదం చేసి, హడావుడి చేయడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.


చట్టం ఏం చెబుతోంది?

థియేటర్‌కు కారులో రావడం తప్పు కాదు. కానీ కారు టాప్ నుంచి లేచి.. అభిమానులకు అభివాదం చేయడం చట్ట విరుద్ధమని అనలిస్టులు అంటున్నారు. అలా చేయడానికి బన్నీ ముందుగా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోలేదని సమాచారం. పర్మిషన్ లేకుండా ఇలా చేసేందుకు చట్టం అనుమతించదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అల్లు అర్జున్ ఇలా చేయడం వల్లే అభిమానులు థియేటర్ దగ్గర భారీ సంఖ్యలో గుమికూడటం, బన్నీ దగ్గరకు వాళ్లు ఒక్కసారిగా వచ్చేందుకు ప్రయత్నించడం, అదే టైమ్‌లో ఆయన సెక్యూరిటీ సిబ్బంది.. ఫ్యాన్స్‌ను వెనక్కి నెట్టడంతో తొక్కిసలాట జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేయడానికి కారణమైందనే వాదన వినిపిస్తోంది.


Also Read:

ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ విడుదల.. కానీ ఇంటికి వెళ్లలేదు

మెగా పవర్ చూపించారు కదా.. ఏకమైనా ఇండస్ట్రీ

For More Telangana And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 09:38 AM