Share News

Amit Shah Vikarabad Live: ప్రధాని మోదీపై ఒక్క అవినీతి మరకా లేదు: అమిత్ షా

ABN , Publish Date - May 11 , 2024 | 12:39 PM

ప్రధాని మోదీ(PM Modi) అధికారం చేపట్టిన పదేళ్లలో ఆయనపై ఒక్క అవినీతి మరక, ఆరోపణలు లేవని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

Amit Shah Vikarabad Live: ప్రధాని మోదీపై ఒక్క అవినీతి మరకా లేదు: అమిత్ షా

వికారాబాద్: ప్రధాని మోదీ(PM Modi) అధికారం చేపట్టిన పదేళ్లలో ఆయనపై ఒక్క అవినీతి మరక, ఆరోపణలు లేవని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

కొంచం ఉష్ణోగ్రతలు ఎక్కువైనా విదేశాలకు వెళ్లే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమకు పోటీనే కాదని షా అన్నారు. అమిత్ షా ఇప్పటికే మూడుసార్లు తెలంగాణకు వచ్చి బీజేపీ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ప్రధాని మోదీ సైతం ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసి బీజేపీకి ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ అగ్రనేతలు తరలివస్తుండటంతో ఆ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - May 11 , 2024 | 12:39 PM