Share News

Amrapali: తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి సహకరించాలి

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:07 AM

స్పెషల్‌ సమ్మరి రివిజన్‌- 2025 ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో తప్పులు లేకుండా తయారు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner should order) అన్నారు.

Amrapali: తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి సహకరించాలి

- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి

హైదరాబాద్‌ సిటీ: స్పెషల్‌ సమ్మరి రివిజన్‌- 2025 ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో తప్పులు లేకుండా తయారు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner should order) అన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అక్టోబర్‌ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు జాబితాలో నమోదుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అర్హులైన వారు ఓటరు జాబితాలో పేరు నమోదు కాని వారు ఓటరుగా నమోదు చేసుకొనే వెసులుబాటును ఎన్నికల కమిషన్‌ కల్పించిందని తెలిపారు.

ఇదికూడా చదవండి: MP Eatala: పేదల ఇళ్లు కూలగొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా..


ఓటరు జాబితాలో తప్పుల సవరణ, పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ కోసం, పోలింగ్‌ స్టేషన్‌ సరిహద్దులు సరిచేయడానికి బీఎల్‌ఓలు ఇంటి ఇంటి సర్వేను అక్టోబరు18 వరకు పూర్తి చేయనున్నట్లు వివరించారు. ‘‘సమగ్ర డ్రాఫ్ట్‌ రోల్స్‌ కోసం, ఓటరు నమోదు, మార్పులు చేర్పుల కోసం ఫారం 1-8 తయారి అక్టోబర్‌ 19నుంచి28 వరకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

ఓటరు జాబితా పబ్లికేషన్‌ అక్టోబర్‌ 29 నుంచి నవంబర్‌ 28 వరకు క్లెయిమ్‌ అండ్‌ అబ్జెక్షన్‌, క్లెయిమ్‌ అండ్‌ అబ్జెక్షన్‌ పరిష్కారం డిసెంబర్‌ 24 వరకు అవకాశం ఉంది. జనవరి 6న తుది జాబితా ప్రచురించనున్నారు.


ఈ నేపథ్యంలో ఆయా పార్టీల ప్రతినిధులు సూచనలను పరిశీలించి తప్పులు లేని ఓటరు జాబితాను తయారు చేయనున్నారు’’ అని కమిషనర్‌ ఆమ్రపాలి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రతినిధి కృష్ణ దాస్‌, ఎంఐఎం ప్రతినిధి సయ్యద్‌ ముస్తఫా, బీఎస్పీ ప్రతినిధి కె. నరేందర్‌ కుమార్‌, బీజేపీ ప్రతినిధులు వీఎస్‌ భరద్వాజ్‌, మర్రి శశిధర్‌ రెడ్డి, కె.పవన్‌కుమార్‌, సీపీఎం నాయకులు శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు నిరంజన్‌, రాజేష్‌ కుమార్‌ తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


.......................................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................................

Hyderabad: అయోధ్య రామాలయ నమూనాలో.. బాలాపూర్‌ గణేశ్‌ మండపం

- వారం ముందు నుంచే భక్తుల సందడి

హైదరాబాద్: బాలాపూర్‌ గణేశ్‌(Balapur Ganesh) మండపాన్ని నిర్వాహకులు ఈ సారి అయోధ్య రామాలయ నమూనాలో తీర్చిదిద్దుతున్నారు. వారం రోజుల ముందునుంచే భక్తులు బాలాపూర్‌కు వచ్చి నిర్మాణంలో ఉన్న మండపాన్ని వీక్షించి, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. గతేడాది బెజవాడ దుర్గమ్మ గుడి ఆకారంలో మండపం ఏర్పాటు చేశామని, ఈ ఏడాది దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ప్రముఖ డెకరేటర్‌ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం ఆకారంలో మండపాన్ని నిర్మిస్తున్నామని బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు.

city3.jpg


మండపాన్ని పరిశీలించిన సీపీ

గణేశ్‌ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరిగేలా మండప నిర్వాహకులు సహకరించాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌ బాబు(Rachakonda Police Commissioner Sudhir Babu) సూచించారు. పోలీసుశాఖ మండప నిర్వాహకులకు, వివిధ శాఖల అధికారులకు సహకరిస్తుందని, కమిటీల నిర్వాహకులు కూడా సహకరించాలని కోరారు. బాలాపూర్‌ గణేశ్‌ మండపం, విగ్రహ ఏర్పాటు పనులను పోలీస్‌ అధికారులతో కలిసి సీపీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బాలాపూర్‌ గణేశ్‌ నిమజ్జనం దారిలో రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. గణేశ్‌ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ సునీతరెడ్డి, ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి, కార్పొరేటర్లు, వంగేటి ప్రభాకర్‌రెడ్డి, మల్లేశ్వరి జైహింద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌ సందర్శన..

హైదరాబాద్‌ సిటీ: రాచకొండ కమిషనర్‌ సుధీర్‌ బాబు బుధవారం మహేశ్వరం పోలీస్‏స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. రిసెప్షన్‌, పెట్రోలింగ్‌ స్టాఫ్‌ వంటి పలు విభాగాల పనితీరు, సీసీటీవీల నిర్వహణ వంటి అంశాలపై సమీక్షించారు. మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని, సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 05 , 2024 | 11:07 AM