TS News: అలర్ట్.. అలర్ట్.. మరో ఐదు రోజులు వర్షాలు..!!
ABN , Publish Date - May 16 , 2024 | 04:54 PM
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్, గుజరాత్ మధ్య ఈ రోజు కీలక మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం (Rain) మొదలైంది. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్, గుజరాత్ మధ్య ఈ రోజు కీలక మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. మ్యాచ్ నేపథ్యంలో వర్షం పడటంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మరో ఐదు రోజులు వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. మరో 5 రోజులు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఐదు రోజులపాటు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
Read Latest Telangana News AND Telugu News