Hyderabad: లంచావతారాలు
ABN , Publish Date - May 21 , 2024 | 03:44 AM
రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కారు. ఇంటి నెంబరు కేటాయించేందుకు రూ.35 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధిక, ఆమెకు సహకరించిన బిల్ కలెక్టర్ బాల్‌రాజ్ ఏసీబీకి పట్టుబడ్డారు.
ఇంటి నంబర్ కేటాయించేందుకు
35 వేలు తీసుకున్న పంచాయతీ కార్యదర్శి
భూమి రిజిస్ట్రేషన్‌కు
రూ.5 వేలు వసూలు చేసిన తహసీల్దార్
ఫైలు ఉన్నతాధికారికి పంపేందుకు రూ.7వేలు తీసుకున్న సీనియర్ అసిస్టెంట్
హైదరాబాద్, కమలాపూర్, సిరిసిల్ల క్రైం, శంషాబాద్/శంషాబాద్ రూరల్, మే 20(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కారు. ఇంటి నెంబరు కేటాయించేందుకు రూ.35 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధిక, ఆమెకు సహకరించిన బిల్ కలెక్టర్ బాల్‌రాజ్ ఏసీబీకి పట్టుబడ్డారు. మరో ఘటనలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు రూ.5వేలు లంచం తీసుకున్న హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవీలతను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. కమలాపూర్ మండలం కన్నూరుకు చెందిన కసరబోయిన గోపాల్ తన తండ్రి రాజయ్య పేర ఉన్న 3.02 ఎకరాల వ్యవసాయ భూమిని గిఫ్టు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఈ నెల 9 ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్నాడు.
రిజిస్ట్రేషన్ చేయాలంటే తనకు రూ.5వేలు, ధరణి ఆపరేటర్ రాకే్‌షకు రూ.వెయ్యి లంచం ఇవ్వాలని తహసీల్దార్‌తేల్చిచెప్పడంతో గోపాల్ ఏసీబీని ఆశ్రయించారు. మరో ఘటనలో కాంట్రాక్టర్ నుంచి రూ.7 వేలు లంచం తీసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి పట్టుబడ్డాడు. జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన వెంకటేశం అనే కాంట్రాక్టర్ తమ గ్రామంలోని శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణం చేపట్టారు. రూ.4.50 లక్షలతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లు ఫైలును చీఫ్ ప్లానింగ్ అధికారికి పంపేందుకు భాస్కర్‌రావు రూ.8వేలు లంచం డిమాండ్ చేశాడు. వెంకటేశం ఏసీబీకి ఫిర్యాదు చేయగా అధికారులు భాస్కర్‌రావు రూ.7వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా ఏసీబీ ట్రాప్, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి మొత్తం 67 కేసులు నమోదు చేసింది. గతంతో పోలిస్తే ఐదు నెలల్లో ఇన్ని కేసులు నమోదు కావడం విశేషం.
అవినీతిపై ఫిర్యాదులకు సోషల్ మీడియా
అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులపై సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా ఏసీబీ స్వీకరిస్తుంది. ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికగా బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ప్రజలు ఏసీబీకి ఠీఠీఠీ.్చఛిఛ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులు అందజేయవచ్చు. లేదా 94404 46106 నెంబర్‌కు వాట్సాప్ చేయవచ్చు. టోల్ ఫ్రీ నెం 1064కు డయల్ చేసి ఫిర్యాదులు చేయవచ్చు. ఏసీబీ తెలంగాణ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు.
సిబ్బంది కొరతతో మరుగున పడుతున్న కీలక కేసులు
అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో దూకుడుగా ఉంటున్న ఏసీబీకి సిబ్బంది కొరత సమస్యగా మారింది. ఆ విభాగంలో సిబ్బంది కొరత వల్ల కొన్ని కీలక కేసుల్లో దర్యాప్తు పెండింగ్‌లో ఉండిపోతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ కేసు ఇందుకు ఉదాహరణ. ఈ కేసు దర్యాప్తు తొలుత దూకుడుగా సాగినా క్రమంగా నెమ్మదించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రైవేటు వ్యక్తులు దుబాయ్‌లో తలదాచుకున్నట్లు గుర్తించిన అధికారులు వారి విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేకపోయారు. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు దర్యాప్తు కూడా ఇలానే నెమ్మదించింది.