AV Ranganath: భూమిలో వర్షపు నీరు ఇంకుతున్నది 0.95 శాతమే..
ABN , Publish Date - Dec 04 , 2024 | 07:50 AM
హైదరాబాద్‌లో ఏటా 89 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతున్నా.. కేవలం 0.95 శాతం వర్షపు నీరు మాత్రమే భూమిలో ఇంకుతోందని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) అన్నారు.
- ముంపు ముప్పులేని నగరంగా తీర్చిదిద్దడం సవాలే
- జియో స్మార్ట్ ఇండియా సదస్సులో రంగనాథ్
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్‌లో ఏటా 89 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతున్నా.. కేవలం 0.95 శాతం వర్షపు నీరు మాత్రమే భూమిలో ఇంకుతోందని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) అన్నారు. వరద ముప్పు లేని నగరాలుగా తీర్చిదిద్దడం పెద్ద సవాల్‌గా మారిందని, నగరంలో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ లక్ష్యంగా హైడ్రా పని చేస్తోందని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఓ వాహనం ఢీకొట్టి.. ఆపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లి..
ఆక్రమణలను తొలగించి హైడ్రా ద్వారా పునరుద్ధరించిన అమీన్‌పూర్ చెరువులోకి తూర్పు యూరప్ నుంచి 12 సెంటిమీటర్ల రెడ్ బ్రెస్టెట్ ప్లైక్యాచర్ పక్షి వలస వచ్చిందని, పర్యావరణ పరిరక్షణ, చెరువుల విషయంలో మనం సరైన మార్గంలో వెళ్తున్నామనేందుకు ఇదే నిదర్శనమన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో విపత్తుల నిర్వహణ, వాతావరణ మార్పులపై హైటెక్స్(Hitex)లో జరిగిన జియో స్మార్ట్ ఇండియా సదస్సులో రంగనాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనా.. నగరంలో వరదలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. నివాస ప్రాంతాలు పెరగడం, చెరువులు, నాలాలు కబ్జా కావడంతో వరద నీరు కాలనీలు, రోడ్లను ముంచెత్తుతున్నదన్నారు. ఈ సమస్య పరిష్కారానికే చెరువుల పునరుద్ధరణ, నాలాలపై ఆక్రమణల తొలగింపుపై దృష్టి పెట్టామన్నారు.
నగరంలో వెదర్ రాడార్ ఒక్కటి, 157 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఉన్నాయని, వీటి సంఖ్య పెంచాల్సిన అవసరముందని వెల్లడించారు. సాంకేతికత ద్వారా వర్ష సూచన, ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశముంది..? ఏ ప్రాంతాల్లో వాన పడుతుంది..? అని సమచారం తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తుగా సమాచారం తెలుసు కుంటే మెరుగైన విపత్తుల నిర్వహణ సాధ్యపడుతుందని, అందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు.
ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Read Latest Telangana News and National News