TG Politics: రేవంత్‌ను ఇప్పుడు ఏ రాళ్లతో కొట్టాలి.. బాల్కసుమన్ ఫైర్
ABN , Publish Date - Apr 02 , 2024 | 07:39 PM
రైతులందరికీ రైతు బంధు డబ్బులు ఇప్పటికీ రాలేదని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ (Balkasuman) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణఏ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతు బంధు కోసం గత ప్రభుత్వం ఖజానాలో ఉంచిన నగదును సీఎం రేవంత్‌రెడ్డి మింగేశారని ఆరోపించారు. రైతు బంధు నిధులు కొన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి, ఇంకొన్ని ఢిల్లీకి కప్పం కట్టారని విమర్శించారు.
హైదరాబాద్: రైతులందరికీ రైతు బంధు డబ్బులు ఇప్పటికీ రాలేదని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ (Balkasuman) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణఏ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతు బంధు కోసం గత ప్రభుత్వం ఖజానాలో ఉంచిన నగదును సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మింగేశారని ఆరోపించారు. రైతు బంధు నిధులు కొన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి, ఇంకొన్ని ఢిల్లీకి కప్పం కట్టారని విమర్శించారు.
ఇంత తక్కువ కాలంలోనే ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వాన్ని దేశంలో ఎక్కడ చూడలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణిలోనే రేవంత్ ప్రభుత్వం పని చేస్తుందని మండిపడ్డారు. రైతు శ్రేయస్సును రేవంత్ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. బీఆర్ఎస్ రోడ్డెక్కితే తప్పా ప్రాజెక్టుల నుంచి నీరు వదలరా? అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేస్తోందని ప్రశ్నించారు.
Komatireddy Venkatreddy: సికింద్రాబాద్ ఎంపీగా దానంను గెలిపించడమే మా బాధ్యత
పేదల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా పక్కన పెట్టారన్నారు. పేదలను ఇబ్బంది పెడితే దేవుని ఆశీర్వాదం కూడా రేవంత్‌కు ఉండదన్నారు. 2014నుంచి 23వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారని చెప్పారు. అయితే అప్పటి హోం సెక్రెటరీలను, డీజీపీలను ఇతర అధికారులను అందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ఒక్క సామాజిక వర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ కేబినేట్‌లో అందరూ రెడ్డి అధికారులే ఉన్నారన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ అన్నారని.. మరి తమ పార్టీ నుంచి గెలిచిన వారిని ఎందుకు కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని నిలదీశారు.
Kadiyam Srihari: బీజేపీ ఆకృత్యాలను అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీల వల్ల కాదు: కడియం శ్రీహరి
రేవంత్‌ను రాళ్లతో కొట్టాలా లేక వాళ్లను కొట్టాలా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి నీతి వంతుడివి అయితే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన నీతులు చెప్పడం కాదని.. రాజీనామా చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పారు. కే. కేశవరావు 85ఏళ్ల వయస్సులో ఎందుకు పార్టీ మారారని ప్రశ్నించారు. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసిందని నిలదీశారు. దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మి పదవులకు రాజీనామా చేయాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
Big Breaking: కల్వకుంట్ల కుటుంబాన్ని వెంటాడుతున్న అరెస్టులు!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి