Share News

Bandi Sanjay : ‘ఎమర్జెన్సీ’ ఓ మాయని మచ్చ

ABN , Publish Date - Jun 26 , 2024 | 03:03 AM

ఎమర్జెన్సీ పాలన దేశానికి ఓ మాయని మచ్చ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికార దాహానికి ఎమెర్జెన్సీ పాలన ఓ నిదర్శనమని అన్నారు.

Bandi Sanjay : ‘ఎమర్జెన్సీ’ ఓ మాయని మచ్చ

ఇందిరను మించిన దురాలోచన రాహుల్‌ది: సంజయ్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎమర్జెన్సీ పాలన దేశానికి ఓ మాయని మచ్చ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికార దాహానికి ఎమెర్జెన్సీ పాలన ఓ నిదర్శనమని అన్నారు. ఇందిరను మించిన దురాలోచన రాహుల్‌ గాంధీదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తారుమారు చేస్తుందని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని పార్లమెంట్‌ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి ఓట్లు పొందాలని చూసిన కాంగ్రె్‌సకు దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతలు మారలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో రాహుల్‌.. ఆయన నానమ్మ ఇందిరాగాంధీని మించిపోయారని అన్నారు. భారతదేశాన్ని అస్థిరపరచడంలో, బలహీనపరచడంలో విదేశీ శక్తుల పాత్ర ఉందనే సాకుతో అధికారాన్ని నిలుపుకునేందుకు నాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే.. అధికారం కోసం రాహుల్‌ గాంధీ విదేశాల్లో పర్యటిస్తూ ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అనే ముసుగులో భారత్‌లో పాశ్చాత్య దేశాల జోక్యం అవసరమంటూ నిస్సిగ్గుగా వేడుకుని దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నించారని సంజయ్‌ ఒక ప్రకటనలో విమర్శించారు.

Updated Date - Jun 26 , 2024 | 03:03 AM