Bandi Sanjay: స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
ABN , Publish Date - May 18 , 2024 | 03:45 AM
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని తప్పనిసరిగా గెలిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపిస్తే.. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించే ప్రమాదం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
లేకపోతే కేంద్రం నిధులు దారిమళ్లే చాన్స్
బీజేపీతోనే పంచాయతీల ప్రగతి: సంజయ్
వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
సీఈవో వికా్‌సరాజ్‌కు రఘునందన్ విజ్ఞప్తి
హైదరాబాద్, మే 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని తప్పనిసరిగా గెలిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపిస్తే.. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించే ప్రమాదం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రజలను అడుగడుగునా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చెప్పి.. మాట తప్పిందని విమర్శించారు.
నిన్నటి దాకా పార్లమెంట్ ఎన్నికల సాకు చూపి దాటవేత ధోరణిని ప్రదర్శించిందని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. 6 గ్యారెంటీల అమలుకు ఎన్ని నిధులు అవసరం..? విధివిధానాలేమిటి..? అనే దానిపై నేటికీ కసరత్తు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పోరు బాట చేపట్టాలని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలకు సంజయ్ పిలుపునిచ్చారు. శనివారం వడ్ల కళ్లాలను సందర్శించాలని, 20న తహశీల్దార్లు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని, 21న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపట్టాలని కోరారు.
వెంకట్రామిరెడ్డిపై సీఈవోకు ఫిర్యాదు
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మెదక్ పరిధిలోని 27 పోలింగ్ బూత్‌ల పరిధిలో పంపిణీ చేసేందుకు తెచ్చిన రూ.84 లక్షలు ఒకే కారులో దొరికాయని.. అవి బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డివేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని శుక్రవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో సీఈవో వికా్‌సరాజ్‌న కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి తరఫున ఆ పార్టీ ముఖ్య నేత హరీశ్ రావు, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. పట్టుబడిన రూ.84 లక్షలు బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి సంబంధించినవే అయినా.. ఆ కేసులో ఆయనను ఏ-5గా చేర్చారని పేర్కొన్నారు. తన ఫిర్యాదుపై ఇక్కడి అధికారులు స్పందించకుంటే ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని రఘునందన్‌రావు వెల్లడించారు.
ధాన్యం కొనుగోళ్లలో అంతులేని అవినీతి: ఏలేటి
ధాన్యం కొనుగోళ్లలో అంతులేని అవినీతి జరుగుతోందని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మిల్లర్లు విచ్చలవిడిగా దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారులకు లబ్ధి చేకూరేలా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ఆరోపించారు. తూకాల్లో మోసం, తాలు, తేమ పేరుతో ధరలో కోత విధిస్తున్నారని మండిపడ్డారు.