Share News

BJP: 11 నుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

ABN , Publish Date - Aug 10 , 2024 | 08:35 AM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 11 నుంచి 15 వరకు వైభవంగా జరుపుకోవాలని బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. గౌతమ్‌రావు(Dr. N. Gautam Rao) పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీరయోధులను స్మరించుకోవాలని ఆయన కోరారు.

BJP: 11 నుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 11 నుంచి 15 వరకు వైభవంగా జరుపుకోవాలని బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. గౌతమ్‌రావు(Dr. N. Gautam Rao) పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీరయోధులను స్మరించుకోవాలని ఆయన కోరారు. బర్కత్‌పుర(Barkatpura)లోని నగర కార్యాలయంలో గురువారం రాత్రి హర్‌ ఘర్‌ తిరంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రావు మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 14 వరకు నియోజకవర్గాల వారీగా బైక్‌ ర్యాలీలు, 12 నుంచి 14 వరకు మహనీయుల విగ్రహాలను శుభ్రం చేయడం, 13న ప్రతీ ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయడం, 15న ప్రతీ బూత్‌లో జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. సమావేశంలో మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్‌, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆనంద్‌గౌడ్‌, సెంట్రల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులు సి. కృష్ణాగౌడ్‌, సందీ్‌పసాయి, కార్పొరేటర్లు కన్నె ఉమాదేవి, వై.అమృత, ఓబీసీ మోర్చా నగర ప్రధాన కార్యదర్శి దేశబోయిన శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 60 మంది.. 20 ముఠాలు.. దాబాల వద్ద ఆగే ట్రావెల్స్‌ బస్సులే లక్ష్యం


క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రధాన భూమిక

స్వాతంత్య్ర సాధనలో క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రధాన భూమిక పోషిక పోషించిందని లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ డిస్ర్టిక్‌ జీఈటీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సర్దార్‌ హర్‌బిందర్‌సింగ్‌ అన్నారు. శుక్రవారం తెలంగాణ సిటిజన్‌ కౌన్సిల్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్విట్‌ ఇండియా డేను పురస్కరించుకొని కాచిగూడ నుంచి వైఎంసీఏ, మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నవ్య కళానికేతన్‌ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి ప్రమోద్‌ మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం విజితారెడ్డి, తెలంగాణ భారత స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ కార్యదర్శి సీజే అరుణ్‌కుమార్‌, దుర్గామాత, విద్యార్థులు పాల్గొన్నారు.


సాంస్కృతిక, సాహిత్య పోటీలు-2024

నల్లకుంట: సర్వేజనా: సుఖినోభవంతు సామాజిక, సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 11న బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాంస్కృతిక, సాహిత్య పోటీలు -2024 నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ఇ.ఎ్‌స.ఎ్‌స.నారాయణ మాస్టారు వెల్లడించారు. వివరాలకు 9652347207లో సంప్రదించాలని ఆయన సూచించారు.

city2.2.jpg


వ్యాసరచన, పాటల పోటీలు

చిక్కడపల్లి: 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం, 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షురాలు డా. హిప్నో పద్మాకమలాకర్‌ తెలిపారు. అశోక్‌నగర్‌లోని మైండ్‌ అండ్‌ పర్సనాలిటీకేర్‌ హాల్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో నవభారత్‌ లయన్స్‌క్లబ్‌ ప్రతినిధి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 10 , 2024 | 08:35 AM