TG NEWS: జితేందర్ రెడ్డి సీఎం రేవంత్‌ను కలవడంపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఏమన్నారంటే..?
ABN , Publish Date - Mar 14 , 2024 | 05:24 PM
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కు అభ్యర్థులు దొరకటం లేదని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత జితేందర్‌రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలసి ఉండవచ్చని తెలిపారు. జితేందర్ రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని తనకు నమ్మకముందని చెప్పారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కు అభ్యర్థులు దొరకటం లేదని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత జితేందర్‌రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలసి ఉండవచ్చని తెలిపారు. జితేందర్ రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని తనకు నమ్మకముందని చెప్పారు. ఖమ్మం, హైదరాబాద్ పార్లమెంట్ సీట్లను తాము గెలిచినా ఆశ్చర్యపోవద్దని అన్నారు. 12 ఎంపీ సీట్లకు పైగా తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సీఏఏ, ముస్లింలకు బీజేపీ (BJP) వ్యతిరేకమనేది ప్రచారం మాత్రమేనని చెప్పారు. చేవెళ్లలో ముస్లింలు బీజేపీకే ఓటు వేస్తారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు వచ్చేసరికి.. బీజేపీ తొలి విడత ప్రచారం పూర్తి చేసిందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననేది ప్రచారం మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు గతంలో కలసి పనిచేసిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. చేవెళ్ల పరిధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారని అన్నారు. దేశ ప్రజలు ప్రధాని మోదీనే మాత్రమే నమ్ముతున్నారని వివరించారు. ఏ వర్గాన్ని బీజేపీ.. ఓటు బ్యాంక్‌గా చూడలేదన్నారు. చేవెళ్లకు మెట్రో రైలు తీసుకురావటానికి కృషి చేస్తానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి
Congress: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి.. అదే కారణమా
Congress: కేసీఆర్ బై బై.. కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి! ప్రియాంక అపాయింట్మెంట్ కోరిన బీఆర్ఎస్ నేతలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి