Home » Jithender Reddy
సొంత అవసరాల కోసం కొంతమంది నేతలు పార్టీలు మారుతున్నారని బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు (Raghunandan Rao) అన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తే బీజేపీలో ఉండేవారని...టికెట్ ఇవ్వకపోతే పార్టీ మంచిది కాదా అని ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కు అభ్యర్థులు దొరకటం లేదని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత జితేందర్‌రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలసి ఉండవచ్చని తెలిపారు. జితేందర్ రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని తనకు నమ్మకముందని చెప్పారు.
రాష్ట్ర బీజేపీకి(BJP) బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బీజేపీ మొండి చేయి చూపడంతో ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో ఎంపీ టికెట్ కోసం ఆశావాహులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ టికెట్ తమకే అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.