Share News

Raghunandan rao: హరీష్‌రావు ఆ గట్టునుంటారో?.. ఈ గట్టునుంటారో?

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:09 PM

Telangana: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 1985లో కేసీఆర్ మొదటిసారిగా సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 39 ఏండ్లుగా సిద్దిపేటలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. శుక్రవారం నంగునూర్ మండలం కోనాయి పల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు.

Raghunandan rao: హరీష్‌రావు ఆ గట్టునుంటారో?.. ఈ గట్టునుంటారో?
BJP MP Candidate Raghunandan Rao

సిద్దిపేట జిల్లా, ఏప్రిల్ 19: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై (BRS Chief KCR) మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు (BJP MP Candidate Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. 1985లో కేసీఆర్ మొదటిసారిగా సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 39 ఏండ్లుగా సిద్దిపేటలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. శుక్రవారం నంగునూర్ మండలం కోనాయి పల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ అంటే కాళేశ్వర రావు అంటారు కానీ నంగునూర్‌లోని ఒక్క చెరువులో నీళ్ళు లేవని విమర్శించారు. ఎన్నికలు కవితను తీహార్ జైలు నుంచి బయటకు తెచ్చే ఎన్నికలు కావన్నారు. రఘునందన్‌రావు దుబ్బాకలో ఓడిపోవడం ఎంత నిజమో కామారెడ్డిలో కేసీఆర్‌ను బీజేపీ వాళ్లు ఓడించింది అంతే నిజమన్నారు. తెలంగాణలో ఆడపిల్లలు లిక్కర్ దందా నడపరన్నారు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ఇంట్లో వాళ్ళు జైలుకు వెళ్లక తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Elections 2024: ఎన్నికల వేళ హింసతో అట్టుడుకుతున్న బెంగాల్.. కూచ్ బిహార్ లో రాళ్లదాడి..


దేశం బాగుంటాలంటే?

రూ.1600 కోట్లతో సిద్దిపేట నుంచి ఎలకతుర్తి వరకు కేంద్ర నిధులతో రోడ్ పనులు నడుస్తున్నాయన్నారు. ఇంకా ఐదేండ్లు ఉచిత రేషన్ బియ్యం అందిస్తామన్నారు. రేవంత్ రెడ్డి గెలిచి నాలుగు నెలలు అయినా రూ.4 వేల పించన్ ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా?.. లేదా ఖాళీ బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా? అని వ్యాఖ్యలు చేశారు. మోదీ రైతులకు సబ్సిడీతో ఎరువుల బస్తాలు అందించారన్నారు. హరీష్ రావు గట్టు మీద నిల్చున్నారని.. కాంగ్రెస్‌లోకి పోతారా?.. అందులోనే ఉంటారా? అనేది తెల్వదంటూ కామెంట్స్ చేశారు.


ఈ దేశం బాగుండాలి అంటే బీజేపీ గెలవాలన్నారు. రాష్ట్రంలో ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే గెలిస్తే ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 న రెండు లక్షల రుణమాఫీ చేస్తానని నేటికీ రుణమాఫి చేయలేదని విమర్శించారు. దేశంలోని ఇస్లామిక్ తీవ్రవాదం పోవాలి అంటే.. హిందూ మత రక్షణ జరగాలి అంటే నరేంద్ర మోడీ గెలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కులం పేరుతో చేస్తున్న రాజకీయాలను తిప్పి కొట్టాలని రఘునందన్‌ రావు పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: నా భార్య నన్ను కొడుతోంది.. ప్లీజ్ విడాకులిప్పించండి..!

TS Politics: బీఆర్‌ఎస్‌‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 19 , 2024 | 01:51 PM