Share News

Etela: కూల్చివేతలను హీరోయిజం అనుకుంటున్న సీఎం

ABN , Publish Date - Sep 12 , 2024 | 04:26 AM

‘‘హైదరాబాద్‌లో ‘హైడ్రా’ చేపడుతున్న కూల్చివేతల తీరు సరికాదు. అక్రమ నిర్మాణాలంటూ.. కట్టడాలను కూల్చివేయిస్తుండడాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హీరోయిజం అనుకుంటున్నారు.

Etela: కూల్చివేతలను హీరోయిజం అనుకుంటున్న సీఎం

  • నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలా?: ఈటల

  • కూల్చివేతలతో నిరుపేదలకే అన్యాయం: డీకే అరుణ

  • బాధిత పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలి: రఘునందన్‌

నల్లగొండ/జహీరాబాద్‌/కొత్తగూడెం, సెప్టెంబరు 11: ‘‘హైదరాబాద్‌లో ‘హైడ్రా’ చేపడుతున్న కూల్చివేతల తీరు సరికాదు. అక్రమ నిర్మాణాలంటూ.. కట్టడాలను కూల్చివేయిస్తుండడాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హీరోయిజం అనుకుంటున్నారు. ఉరి శిక్ష పడ్డ వ్యక్తిని ఉరివేసే ముందు చివరి కోరిక ఏమైనా ఉందా? అని అడుగుతారు. కట్టడాల కూల్చివేతలకు ముందు ప్రభుత్వం కనీసం నోటీసులు కూడా ఇవ్వడం లేదు’’ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. నల్లగొండ ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల గ్రామాల్లో ప్రజలు వైరల్‌ జ్వరాల బారిన పడుతున్నారన్నారు.


ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రా పేరిట చేపడుతున్న కూల్చివేతలతో నిరుపేదలకే అన్యాయం జరుగుతోందని మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోఆమె మాట్లాడుతూ.. హైడ్రా.. ఓ డ్రామలా తయారైందని విమర్శించారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరిట పేద ప్రజల ఇళ్లను కూలగొట్టడం, ఆస్తి నష్టం చేయడం సమంజసం కాదని మెదక్‌ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. కూల్చివేతల వల్ల బాధితులవుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నయం చూపించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 12 , 2024 | 04:26 AM