Share News

BJP: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత..

ABN , Publish Date - Dec 04 , 2024 | 09:52 AM

ఆరు గ్యారెంటీలను అమలుచేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రజాపాలన పేరిట విజయోత్సవాలు నిర్వహిస్తుందని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి లంకల దీపక్‌రెడ్డి(BJP in-charge Lankala Deepak Reddy) విమర్శించారు.

BJP: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత..

- బీజేపీ నేత లంకల దీపక్‌ రెడ్డి

హైదరాబాద్: ఆరు గ్యారెంటీలను అమలుచేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రజాపాలన పేరిట విజయోత్సవాలు నిర్వహిస్తుందని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి లంకల దీపక్‌రెడ్డి(BJP in-charge Lankala Deepak Reddy) విమర్శించారు. నాగార్జుననగర్‌ కాలనీలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్‌ వైఫల్యాలపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు రూపొందించిన చార్జ్‌షీట్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 66 మోసాలతో ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను చవిచూస్తుందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA Danam: కనీవిని ఎరుగని రీతిలో విజయోత్సవాలు..


city6.jpg

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మూసీ నది ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వ విధానాలకే తాము వ్యతిరేకమన్నారు. హైడ్రా పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 5న కార్మికనగర్‌ ఆటోస్టాండ్‌ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు దీపక్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్‌ కుంభాల గంగరాజు, ప్రేమ్‌కుమార్‌, కొలన్‌ సత్యనారాయణ, సుప్రియ, డి.నాగేశ్వరరావు, బి.జ్యోతి, మల్లేష్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


ఖైరతాబాద్‌ బీజేపీ ఆధ్వర్యంలో..

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఖైరతాబాద్‌ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్‌, వెంకటేశ్వరనగర్‌కాలనీ డివిజన్‌లలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, స్రెంటల్‌ జోన్‌ అధ్యక్షుడు గౌతమ్‌రావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఒక్క హామీని కూడా సరిగా నెరవేర్చడం లేదన్నారు. ఏడాదిలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా విజయోత్సవాలు నిర్వహించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.


ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 04 , 2024 | 09:52 AM