BRS: తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు:బీఆర్‌ఎస్
ABN , Publish Date - Aug 16 , 2024 | 04:01 AM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అస్తిత్వానికి భంగం కలుగుతోందని, స్వార్థ రాజకీయం కోసం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ నేతలు ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి శ్రీనివా్‌సగౌడ్ ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అస్తిత్వానికి భంగం కలుగుతోందని, స్వార్థ రాజకీయం కోసం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ నేతలు ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి శ్రీనివా్‌సగౌడ్ ఆరోపించారు. రాష్ట్రానికి ఏమాత్రం సబంధంలేని అభిషేక్ మను సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
కాంగ్రె్‌సలో అనుభవం, అర్హత కలిగిన సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నా, వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం విచారకరమన్నారు. అభిషేక్ సింఘ్వీ మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకి అని, హైదరాబాద్ నగరంలేని రాష్ట్రం ఇవ్వాలని ఆయన గతంలో ప్రతిపాదించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని, సీనియర్ నాయకుడు హనుమంతరావుకు ఇచ్చినా బాగుండేదని అభిప్రాయపడ్డారు.