Share News

Telangana: పీఎం, సీఎంపై కేటీఆర్ హాట్ కామెంట్స్..

ABN , Publish Date - Oct 17 , 2024 | 09:30 PM

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్వీ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Telangana: పీఎం, సీఎంపై కేటీఆర్ హాట్ కామెంట్స్..
BRS MLA KTR

హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్వీ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పైన జుమ్లా పీఎం.. కింద హౌలా సీఎం ఉన్నారంటూ పరుష పదజాలంతో విరిచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అనేక మంది విద్యార్థులను నాయకులుగా తీర్చిదిద్దిందన్నారు కేటీఆర్. పార్టీ పెట్టిన తరువాత తొలిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామన్న కేటీఆర్.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదురొడ్డి నిలబడతామన్నారు.


ఢిల్లీకి కప్పం కట్టి పదవిని కాపాడుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డితోనే కొట్లాడామని.. రేవంత్ రెడ్డి ఒక లెక్క కాదన్నారు. కానీ, రేవంత్ రెడ్డితో కొట్లాడాలంటే మనసు ఒప్పడం లేదన్నారు. గుంపు మేస్త్రీ అంటే నిర్మాణాలు చేపడుతారని.. కూలగొట్టేవారు మేస్త్రీ కాదన్నారు. దేశంలో జోనల్ వ్యవస్థ ద్వారా 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడా లేవన్నారు.


రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారని కేటీఆర్ అన్నారు. 12 వేల మంది ఆశా వర్కర్లతో భారీ సభ నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ ఇచ్చిన జీవో 55ను రద్దు చేసి జీవో 29 తీసుకువచ్చారని విమర్శించారు. జీవో 29వలన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. నవంబర్ 5వ తేదీన జరుగనున్న ఆటో డ్రైవర్ల ధర్నాకు మద్దతు ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు. రేవంత్ రెడ్డి పరిపాలనలో బాధపడని వారు లేరన్నారు. సిద్ధిపేటలో ఒకే ఇంట్లో నలుగురికి మెడికల్ సీట్లు వచ్చాయని గుర్తు చేసిన కేటీఆర్.. హరీష్ రావు కుట్రతోనే ఆ నలుగురికి మెడికల్ సీట్లు వచ్చాయని రేవంత్ అనుకుంటారని ఎద్దేవా చేశారు.


ఢిల్లీకి వెళ్లడంలో సీఎం రేవంత్ రెడ్డి సిల్వర్ జూబ్లీ కొట్టారంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరంకాదన్నారు. తెలంగాణను నాశనం చేస్తుంటే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పైన జుమ్లా పీఎం.. కింద హౌలా సీఎం ఉన్నారని.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవితను అక్రమంగా ఐదు నెలల్లో జైల్లో పెట్టారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి.. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ ప్రత్యర్థులేనని అన్నారు. బీజేపీ డేంజర్ పార్టీ అని.. మతం పేరుతో పిల్లలను రెచ్చగొడుతోందన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని.. అందరికీ అవకాశాలొస్తాయని కేటీఆర్ చెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ రైడ్స్ అయితే నోట్ ఎందుకు బయటపెట్టలేదని కేటీఆర్ ప్రశ్నించారు.


Also Read:

ఆ కేసులో ఈడీ ఎదుట హాజరైన నటి తమన్నా భాటియా

పోలీసుల విచారణలో సజ్జల వితండవాదం..!

విచారణకు సహకరించని సజ్జల..

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 17 , 2024 | 09:30 PM