Hayathnagar: 20 కోట్లతో ఉడాయించిన చిట్టీల వ్యాపారి..
ABN , Publish Date - Jul 01 , 2024 | 04:51 AM
ఎత్తిన చిట్టీ డబ్బుకు అధిక వడ్డీ ఆశ చూపి ఓ వ్యాపారి వంద మందికి పైగా బాధితుల నుంచి రూ.20కోట్లకు పైగా వసూలు చేసుకుని దుకాణం ఎత్తేశాడు.
హయత్‌నగర్, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఎత్తిన చిట్టీ డబ్బుకు అధిక వడ్డీ ఆశ చూపి ఓ వ్యాపారి వంద మందికి పైగా బాధితుల నుంచి రూ.20కోట్లకు పైగా వసూలు చేసుకుని దుకాణం ఎత్తేశాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలుకు చెందిన చిట్టెటి మధుసూధన్‌రెడ్డి మన్సూరాబాద్ డివిజన్ రాజరాజేశ్వరీకాలనీలో నివాసం ఉంటున్నాడు. ఓకళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.
ప్రవృత్తిగా చిట్టీల వ్యాపారం చేస్తుంటాడు. ఎత్తిన చిట్టీ డబ్బులకు అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపడంతో అనేక మంది డబ్బులు అతని వద్దనే ఉంచి ప్రతి నెల వడ్డీ తీసుకునే వారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి శుక్రవారం ఇల్లు ఖాళీ చేసి కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న బాధితులు శనివారం హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. అతనిపై 420సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదైంది.