YS Viveka Case: వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి బెయిల్
ABN , Publish Date - May 10 , 2024 | 09:44 PM
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
హైదరబాద్: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల నేపథ్యంలో మే 13న ఒక్క రోజు పులివెందులకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకొనేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఏపీలోకి అడుగు పెట్టాలంటే ట్రయల్ కోర్టు అనుమతి తీసుకోవాలని హైకోర్టు షరతు విధించింది.
ఈ నేపథ్యంలో పులివెందుల వెళ్లేందుకు షరతులతో కూడా అనుమతి మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే పులివెందులలో ఎవరినీ కలవకూడదని, ఎవరితోనూ మాట్లాడకూడదని నిబంధనలు విధించింది. కేవలం ఓటు హక్కు వినియోగించుకొని, పులివెందుల నుంచి తిరిగిరావాలంటూ ఆదేశించింది. ఈ కేసులో మరో నిందితుడు దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కూడా పులివెందుల వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేసింది.