Share News

PM Modi: 2028 డిసెంబరు వరకూ పోషక బియ్యం

ABN , Publish Date - Oct 10 , 2024 | 03:13 AM

దసరా పండుగ వేళ దేశంలోని కోట్లాది మంది పేదలకు మేలు చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

PM Modi: 2028 డిసెంబరు వరకూ పోషక బియ్యం

  • 17,082 కోట్ల వ్యయంతో సరఫరా

  • లోథాల్‌లో ఎన్‌ఎంహెచ్‌సీ అభివృద్ధి

  • కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 9: దసరా పండుగ వేళ దేశంలోని కోట్లాది మంది పేదలకు మేలు చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి పోషకాహారం అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పోషక బియ్యం సరఫరాను 2028 డిసెంబరు వరకూ కొనసాగించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై), ఇతర సంక్షేమ పథకాల కింద ఇచ్చే ఉచిత బియ్యంలో ఈ ఫోర్టిఫైడ్‌ రైస్‌ను కలిపేందుకు రూ.17వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.


ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా, గుజరాత్‌లోని లోథాల్‌ వద్ద నేషనల్‌ మారిటైమ్‌ హెరిటేజ్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎంహెచ్‌సీ) అభివృద్ధి ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 15వేల మందికి ప్రత్యక్షంగా, 7వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం ప్రకటించింది.

Updated Date - Oct 10 , 2024 | 03:13 AM