CM Revanth Reddy: ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:05 AM
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలవనున్నారు.
వరద సాయం కోసం నేడు అమిత్‌షాతో భేటీ
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కూడా ఢిల్లీకి
కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలవనున్న నేతలు
న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలవనున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి సంబంధించి అంచనాల నివేదికను అమిషాకు సమర్పించి కేంద్ర సాయం కోరనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి.. ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని కోరనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన మహేశ్‌కుమార్ గౌడ్ కూడా బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.
గురవారం సీఎంతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోపాటు అగ్రనేత సోనియాగాంధీని మహేశ్‌కుమార్ గౌడ్ కలుసుకోనున్నారు. తనను పీసీసీ చీఫ్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలపనున్నారు. కాగా, కాంగ్రె్‌సలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై 4వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు తీర్పు అంశాన్ని అధిష్ఠానం దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న మంత్రి పొన్నం క్రిబ్కో చైర్మన్ చంద్రపాల్‌సింగ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.