CM Revanth: ధాన్యం కొనుగోళ్లల్లో నిర్లక్ష్యం వహించొద్దు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Apr 11 , 2024 | 03:41 PM
ధాన్యం కొనుగోళ్లల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు X (ట్విట్టర్) వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. ఈ మేరకు సంబంధిత వ్యవసాయ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Revanth Reddy: ఢిల్లీకి రేవంత్.. ఈసారైనా క్లారిటీ వస్తుందా?
జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన ఘటనపై రేవంత్ అధికారులను మందలించారు. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌కి అభినందనలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కాగా మరోవైపు ధాన్యాన్ని కొనట్లేదని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. అసలే వేసవికాలం పొలంలో ధాన్యం ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పలుమార్లు ధాన్యాన్ని కొనాలని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రైతుల విన్నపంతో ప్రభుత్వం త్వరగా ధాన్యాన్ని కొనాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా తమకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
ఇవి కూడా చదవండి
Padi Koushik Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలను వదిలి పెట్టం
KTR: పూలే ఎంచుకున్న మార్గం అందరికీ ఆచరణీయం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...