CM Revanth Reddy: ట్రాఫిక్ పరిష్కారానికి హోంగార్డులు..
ABN , Publish Date - Jun 16 , 2024 | 03:19 AM
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు హోంగార్డులను ట్రాఫిక్ విధుల్లో నియమించాలని సూచించారు. ట్రాఫిక్‌జామ్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్‌ఎం రేడియోల ద్వారా ప్రజలకు అందజేయాలన్నారు.
సిబ్బంది కొరతను అధిగమించేందుకు వారి సేవల వినియోగం
ట్రాఫిక్‌జామ్‌లపై ఎఫ్‌ఎంలో ప్రచారం.. ఔటర్ లోపల
సీసీకెమెరాలన్నింటినీ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానించండి
వర్షాల నేపథ్యంలో అప్రమత్తం.. అధికారులకు సీఎం ఆదేశం
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు హోంగార్డులను ట్రాఫిక్ విధుల్లో నియమించాలని సూచించారు. ట్రాఫిక్‌జామ్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్‌ఎం రేడియోల ద్వారా ప్రజలకు అందజేయాలన్నారు. శనివారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం సందర్శించారు. వర్షాకాలం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) పరిధిలోని ప్రాంతాలను యూనిట్‌గా తీసుకుని విపత్తు నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలన్నారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటిని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పటిష్ఠ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే వరద తీవ్రత ఎక్కువగా ఉండే 141 ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. వరద నీటి సమస్యకు పరిష్కారంగా వాటర్ హార్వె్‌స్టలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం వెంట సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.