Share News

Sitarama Project: 15న సీతారామ పంపుహౌస్‌ల ప్రారంభం..

ABN , Publish Date - Aug 06 , 2024 | 02:50 AM

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఆగస్టు 15న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా సీతారామ ప్రాజెక్టు పంపుహౌ్‌సలను జాతికి అంకితం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

Sitarama Project: 15న సీతారామ పంపుహౌస్‌ల ప్రారంభం..

  • వైరాలో లక్ష మంది రైతులతో బహిరంగ సభ: తుమ్మల

వైరా, ఆగస్టు 5: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఆగస్టు 15న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా సీతారామ ప్రాజెక్టు పంపుహౌ్‌సలను జాతికి అంకితం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా వైరాలో లక్ష మంది రైతులతో బహిరంగ నిర్వహిస్తామని తెలిపారు. సభా స్థలాన్ని ఖమ్మం కలెక్టర్‌ ముజ్మమిల్‌ఖాన్‌, ఖమ్మం సీపీ సునీల్‌దత్‌ తదితరులతో కలిసి సోమవారం తుమ్మల పరిశీలించారు.


ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారిగా ఆగస్టు 5న సాగర్‌ జలాలను విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఒకవైపు కృష్ణా జలాలు, మరోవైపు గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌ సహా ఖమ్మం జిల్లాలో ఆగస్టు 15 నాటికి ప్రవహించనున్నాయని తెలిపారు. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా సీఎం రేవంత్‌రెడ్డి వైరా సభలో స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పారు. ఆగస్టు 15న రైతు దినోత్సవంగా జరుపుకోబోతున్నామని వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత ప్రాంతంలో సీఎం బహిరంగ సభ నిర్వహించేందుకు ఆయన కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Updated Date - Aug 06 , 2024 | 02:50 AM