Share News

Cognizant: 14న కాగ్నిజెంట్‌ విస్తరణ..

ABN , Publish Date - Aug 08 , 2024 | 03:12 AM

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ తన విస్తరణ ప్రణాళికను ఈ నెల 14న ప్రారంభించనుంది. ఈ మేరకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ నెల 5న న్యూజెర్సీలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో రవికుమార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే.

Cognizant: 14న కాగ్నిజెంట్‌ విస్తరణ..

  • శంకుస్థాపనకు హాజరుకానున్న సీఎం

  • విదేశాల్నించి రాగానే తొలి కార్యక్రమం ఇదే

  • శంకుస్థాపనకు హాజరుకానున్న సీఎం

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ తన విస్తరణ ప్రణాళికను ఈ నెల 14న ప్రారంభించనుంది. ఈ మేరకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ నెల 5న న్యూజెర్సీలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో రవికుమార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌లో తన విస్తరణ ప్రణాళికను కంపెనీ ప్రకటించింది. అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా తమ ప్రణాళిక ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం 10 లక్షల చదరపు అడుగుల్లో కొత్త క్యాంపస్‌ ఉంటుందని తెలిపింది.


ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్న పది రోజుల్లోపే కొత్త క్యాంపస్‌ ఏర్పాటుపై దృష్టి సారించింది. అమెరికా పర్యటన నుంచి ఈ నెల 14వ తేదీ ఉదయం హైదరాబాద్‌ చేరుకోనున్న ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అదేరోజు జరగనున్న శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ కూడా దీనికి హాజరు కానున్నారు. కాగా, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని కాగ్నిజెంట్‌ ప్రకటించింది.


1994లో చెన్నై కేంద్రంగా పునాది వేసుకున్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హైదరాబాద్‌లో 2002 నుంచి కార్యకలాపాలు ప్రారంభించగా.. ప్రస్తుతం ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంప్‌సలు కలిగి ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీకి హైదరాబాద్‌లో దాదాపు 18 వేల మంది ఉద్యోగులున్నారు. నగరంలోనే ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థగా కాగ్నిజెంట్‌కు పేరుంది.

Updated Date - Aug 08 , 2024 | 03:12 AM