Share News

Congress: ఇథనాల్‌ పరిశ్రమలో ‘తలసాని’కి భాగస్వామ్యం

ABN , Publish Date - Nov 30 , 2024 | 01:29 PM

వివాదాస్పద ఇథనాల్‌ పరిశ్రమలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌(MLA Talasani Srinivas Yadav)తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం ఉందని సనత్‌నగర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

Congress: ఇథనాల్‌ పరిశ్రమలో ‘తలసాని’కి భాగస్వామ్యం

- కాంగ్రెస్‌ నాయకుల ఆరోపణ

హైదరాబాద్: వివాదాస్పద ఇథనాల్‌ పరిశ్రమలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌(MLA Talasani Srinivas Yadav)తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం ఉందని సనత్‌నగర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. బేగంపేట(Begumpet)లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ నేత విశాల్‌ సూదం నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో పలు డివిజన్లకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాల్‌ సూదాం మాట్లాడుతూ.. ఇథనాల్‌ పరిశ్రమలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కుమారుడు సాయికిరణ్‌యాదవ్‌, ఇతర కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Tiger Attack: ఆ జిల్లా ప్రజలను వణికిస్తున్న పెద్దపులి.. మరోసారి రైతుపై దాడి..


city7.2.jpg

ఈ విషయాన్ని దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ నేతలు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో ఇథనాల్‌ ప్రాజెక్టు(Ethanol project)కు అనుమతులు మంజూరు కావడంలో కేటీఆర్‌ కీలక పాత్ర వహించారన్నారు. ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా సనత్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి డా. కోట నీలిమ అధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రతా్‌పనాయక్‌, ఖమర్‌ అహ్మద్‌, మునీర్‌ఖాన్‌, హని్‌ఫఖాన్‌, మనోజ్‌, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం

ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2024 | 01:29 PM