CP CV Anand: ప్రహసనం కాదు.. ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 08 , 2024 | 07:48 AM
‘ప్రజలకు దూరం.. అధికారులకు భారం.. దూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులు.. సీపీని కలవడం ఓ ప్రహసనం..’ గతంలో బంజారాహిల్స్(Banjara Hills)లోని కమాండ్‌కంట్రోల్ సెంటర్‌లో ఉన్న సిటీ పోలీస్ కమిషనరేట్ గురించి ఉన్న అభిప్రాయం ఇది.
- కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న సీవీ ఆనంద్
- ఆలస్యమైనా అందరినీ కలిసి వెళ్తున్న నగర కొత్వాల్
హైదరాబాద్ సిటీ: ‘ప్రజలకు దూరం.. అధికారులకు భారం.. దూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులు.. సీపీని కలవడం ఓ ప్రహసనం..’ గతంలో బంజారాహిల్స్(Banjara Hills)లోని కమాండ్‌కంట్రోల్ సెంటర్‌లో ఉన్న సిటీ పోలీస్ కమిషనరేట్ గురించి ఉన్న అభిప్రాయం ఇది. బషీర్‌బాగ్ నుంచి టీజీ ఐసీసీసీ (తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్)కి సీపీ కార్యాలయం మారిన తర్వాత ప్రజలు సీపీని కలవాలంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. సామాన్య ప్రజలు సీపీ కలవడానికి ఐసీసీసీకి వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యం లేకపోవడమూ ఒక కారణం కాగా, ఎత్తయిన భవనం, అత్యాధునిక అద్దాల ఆకాశహర్మ్యం.. హై సెక్యూరిటీ.. హడావిడి.. హంగూ ఆర్భాటాలు, సీపీని కలవాలంటే సవాలక్ష ఆంక్షలు. దీంతో సీపీని కలవకుండానే సామాన్యులు వెనుదిరిగేవారు. ముందస్తుగా అనుమతి ఉన్నవారు, బడాబాబులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారు మాత్రమే సీపీని కలిసే అవకాశం ఉందని, సామాన్యులు కలవడం కష్టమే అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఈ వార్తను కూడా చదవండి: Dussehra: దసరాకు 6,304 ప్రత్యేక బస్సులు..
ప్రజా సమస్యలకు ప్రథమ ప్రాధాన్యం..
రెండోసారి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ సీవీ ఆనంద్(CP CV Anand).. ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు.. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. సాధారణ ప్రజలకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌లలో సమస్యలు పరిష్కారం కాక.. అక్కడి సిబ్బందితో విసిగి వేసారిపోయిన సమస్య పరిష్కారం కాకపోవడంతో.. బాధిత ప్రజలు సీపీని కలిసి తమ సమస్యలు చెప్పుకొని ఫిర్యాదు చేయడానికి పోటెత్తున్నారు. రోజుకు 50 మందికిపైగా బాధితులు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చి సీపీని కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారంటే అతిశయోక్తికాదు.
అందరినీ కలిసి.. ఓపికతో విని..
రోజు విడిచి రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేకంగా సామాన్య ప్రజలను కలవడానికి సమయం కేటాయించారు సీపీ సీవీ ఆనంద్. ప్రతిఒక్క ఫిర్యాదుదారుడితో మాట్లాడి, వారి సమస్యలను ఓపిగా విని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో రాత్రి 7 గంటల వరకూ ఉండి అందరినీ కలిసి, వారి సమస్యలు విన్న తర్వాతనే వెళ్తున్నట్లు తెలిసింది. దాంతో బాధిత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీపీ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు మారిన కొత్తలో పట్టుమని పది మంది కూడా సీపీని కలిసే పరిస్థితి ఉండేది కాదు.. ఇటీవలి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది.
ప్రస్తుత సీపీ ఆ పద్ధతిని మార్చేశారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పోలీస్‌స్టేషన్‌లలో సమస్యలు పరిష్కారం కాక.. ఇబ్బందులు పడే బాధితులు నేరుగా సీపీని కలిసి సమస్య విన్నవించి ఫిర్యాదు చేస్తున్నారు. ఒక భద్రత, భరోసాతో నగర ప్రజలు ఇప్పుడు ఎంతో నమ్మకంగా తమ బాధలు చెప్పుకోవడానికి సీపీ కార్యాలయానికి వెళ్తున్నారు. అయినప్పటికీ దూరాభారంతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రాలేకపోతున్న ప్రజల కోసం ప్రతి శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో సీపీ అందుబాటులో ఉంటున్నారు.
ఇదికూడా చదవండి: Harish Rao: జర్నలిస్టులకు సర్కారు దసరా కానుక ఇదేనా?
ఇదికూడా చదవండి: Hyderabad: త్వరలో టీడీపీలోకి తీగల
ఇదికూడా చదవండి: Police Department: అవినీతి ఐపీఎస్‌లపై కొరడా!
ఇదికూడా చదవండి: Gold Prices Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి ధరలు..
Read Latest Telangana News and National News