Share News

CP CV Anand: టైమ్‌ అంటే టైమే.. సమయానికి దుకాణాలను మూసేయాల్సిందే

ABN , Publish Date - Sep 25 , 2024 | 08:13 AM

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో దుకాణాలు, ఫుడ్‌ కోర్టులు, వ్యాపారసముదాయాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌షాపులు.. కచ్చితమైన సమయపాలన పాటించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రిపూట సమయానికి దుకాణాలు మూసివేయాలని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(City Police Commissioner CV Anand) స్పష్టం చేశారు.

CP CV Anand: టైమ్‌ అంటే టైమే.. సమయానికి దుకాణాలను మూసేయాల్సిందే

- రూల్స్‌ అతిక్రమిస్తే వ్యాపారులపై చట్ట ప్రకారం చర్యలు

- సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో దుకాణాలు, ఫుడ్‌ కోర్టులు, వ్యాపారసముదాయాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌షాపులు.. కచ్చితమైన సమయపాలన పాటించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రిపూట సమయానికి దుకాణాలు మూసివేయాలని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(City Police Commissioner CV Anand) స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని జోన్‌ల డీసీపీలు, డివిజన్‌ ఏసీపీలు, పోలీస్ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్ మెంట్స్‌ యాక్టు తెలంగాణ.. నిబంధనల ప్రకారం దుకాణ యజమానులు పాటించాల్సిన నిబంధనలు ఇవీ..

ఇదికూడా చదవండి: అక్టోబరులో 4.25 లక్షల మందికి రుణమాఫీ!


ఉదయం 9 నుంచి రాత్రి 11 వరకు

క్లాత్‌స్టోర్స్‌, జువెల్లరీషాప్స్‌, సూపర్‌మార్కెట్లు, ఎలక్ట్రానిక్‌షాప్స్‌, సెల్‌ఫోన్‌ షాప్స్‌, కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, బుక్‌స్టాల్స్‌ తదితర దుకాణాలు

మద్యం దుకాణాలు: ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు

బార్‌లు: జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు.. చుట్టూ 5 కి.మీ. లోపు విస్తీర్ణం వరకు ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు, వారాంతాల్లో (శుక్ర, శని) - ఉదయం 10 నుంచి రాత్రి 1:00 వరకు


పుడ్‌కోర్టులు: ఉదయం 5 నుంచి రాత్రి 1 వరకు.. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ నిబంధనల ప్రకారం ఫుడ్‌ కోర్టులు (ఈటరీస్‌).. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఐస్‌క్రీమ్స్‌ పార్లర్స్‌, బేకరీస్‌, టిఫిన్‌ సెంటర్లు, కాఫీషా్‌పలు, టీస్టాళ్లు, పాన్‌షా్‌పలు వంటివి గతంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 12 వరకు సమయపాలన పాటించేది. ఇటీవల ప్రభుత్వం ఆ నిబంధనలు సడలించి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు పొడిగించిందని స్పష్టం చేశారు. సిటీ కమిషనరేట్‌ పరిధిలో ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని సీపీ స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుండా ఎవరైనా ఉల్లంఘించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

city1.2.jpg


ఇదికూడా చదవండి: మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ఇదికూడా చదవండి: రేవంత్‌రెడ్డి.. కోర్టుకు రండి!

ఇదికూడా చదవండి: తెలంగాణలో రేవంత్‌ కుటుంబం దోపిడీ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2024 | 08:13 AM