Share News

Koonaneni : పేదల జోలికి హైడ్రా వస్తే సహించం: కూనంనేని

ABN , Publish Date - Sep 30 , 2024 | 03:21 AM

హైడా పేరుతో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న తొందర పాటు చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

Koonaneni : పేదల జోలికి  హైడ్రా వస్తే సహించం: కూనంనేని

ఇల్లెందు, సెప్టెంబరు 29: హైడా పేరుతో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న తొందర పాటు చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఫాం హౌస్‌లు, సంపన్నుల భవనాలు తొలగిస్తే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ పేదల జోలికి వస్తే మాత్రం ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన సీపీఐ జనరల్‌ బాడీ విస్తృత స్థాయి సమావేశంలో కూనంనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ కోసం శాసనసభ ఎన్నికల్లో సీపీఐ త్యాగాలు చేసిందని గుర్తుచేశారు.


ఇష్టారాజ్యంగా బీఆర్‌ఎస్‌ తరహాలో వ్యవహారిస్తే కాంగ్రెస్‌ నష్టపోతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సకు దశ దిశ అర్థం కావడం లేదని, కాంగ్రె్‌సకు ఆవేశం ఉంది కానీ ఆలోచన, నిర్ధిష్ట ప్రాతిపదిక లేదని విమర్శించారు. కాంగ్రె్‌సతో పొత్తు ఉంటే అన్నింటినీ సమర్ధించడం తమ పార్టీ సిద్ధాంతం కాదని కూనంనేని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌, కోఆప్షన్‌ సభ్యుడు బాసా శ్రీనివాసరావుతో పాటు ఇల్లెందు, కోయగూడెం, ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు సీపీఐలో చేరారు. వారికి ఎమ్మెల్యే కూనంనేని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

Updated Date - Sep 30 , 2024 | 03:21 AM