Share News

Cyber ​​criminals: డిజిటల్ అరెస్ట్.. అలెర్ట్.. భయపెట్టి దోచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు

ABN , Publish Date - Dec 20 , 2024 | 10:04 AM

సరికొత్త సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. మానసికంగా వేధింపులకు గురిచేసి డబ్బు దోచుకునేందుకు సైబర్‌ నేరగాళ్ల(Cyber ​​criminals) అత్యాధునిక సైబర్‌ మోసం డిజిటల్‌ అరె్‌స్టను తెరపైకి తెచ్చారు. డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులతో భయాందోళనకు గురైన వారు గుర్తుతెలియని మోసగాళ్ల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేస్తున్నారు.

Cyber ​​criminals: డిజిటల్ అరెస్ట్.. అలెర్ట్.. భయపెట్టి దోచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు

- ఇటీవల పెరుగుతున్న కొత్త తరహా నేరాలు

- ఒక్క రాచకొండలోనే ఏడాదిలో158 కేసులు

- అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

‘‘హలో.. ఓ బాలుడు కిడ్నా్ప్‏నకు గురయ్యాడు. కిడ్నాపర్లు అతని తండ్రి వద్ద వసూలు చేసిన డబ్బులు మీ బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యాయి’’ అంటూ డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరించి హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడి నుంచి బుధవారం రూ.9.30 లక్షలు దోచేశారు. ఈ తరహా నేరాలపై ఒక్క రాచకొండ కమిషనరేట్‌(Rachakonda Commissionerate) పరిధిలోనే ఏడాదిలో 158 కేసులు నమోదు అయ్యాయి.

హైదరాబాద్: సరికొత్త సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. మానసికంగా వేధింపులకు గురిచేసి డబ్బు దోచుకునేందుకు సైబర్‌ నేరగాళ్ల(Cyber ​​criminals) అత్యాధునిక సైబర్‌ మోసం డిజిటల్‌ అరె్‌స్టను తెరపైకి తెచ్చారు. డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులతో భయాందోళనకు గురైన వారు గుర్తుతెలియని మోసగాళ్ల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేస్తున్నారు. డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: టూరిజం సమాచారం కోసం హెల్ప్‌డెస్క్‌..


మోసాలు ఇలా..

క్రితం ఓ ప్రైవేట్‌ ఉద్యోగి కేశవ్‌కుమార్‌కు రెండురోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వీడియోకాల్‌ వచ్చింది. పోలీసు దుస్తుల్లో ఓ అధికారిలా పరిచయం చేసుకున్న సైబర్‌ మోసగాడు మీపై పలు క్రిమినల్‌ కేసులున్నాయని, అక్రమ లావాదేవీలు ఉన్నాయని, మిమ్మల్ని డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నామని బెదిరించాడు. కంగుతిన్న కేశవ్‌కుమార్‌.. పరిష్కారమార్గం ఎలా అని అడిగితే.. ఓ లింకు పంపుతాం దాని ద్వారా డబ్బు బదిలీ చేస్తే ఓకేఅని చెప్పాడు.

ట్రాయ్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ..

‘‘టెలికమ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) నుంచి మాట్లాడుతున్నాం.. మీ నంబర్‌పై అక్రమ ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నట్టు సమాచారం ఉంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మీపై చర్యలు తీసుకుంటాం. మిమ్మల్ని డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నాం’’ అని మరో వ్యక్తిని బెదిరించారు. ఈ కేసుల నుంచి విముక్తి పొందాలంటే డబ్బు మా ఖాతాల్లోకి బదిలీ చేయండి, నిశ్చింతగా ఉండండి అంటూ సైబర్‌ మోసగాళ్లు ఇలా లక్షల్లో డబ్బు దోచుకున్నారు.


రాచకొండ పరిధిలో 158 కేసులు

రాచకొండ కమిషనరేట్‌ సైబర్‌ పీఎస్‏లో ఏడాదిలో ఇప్పటివరకు 158 డిజిటల్‌ అరెస్ట్‌ కేసులు నమోదయ్యాయి. వాటి ఛేదనలో పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల కాల్స్‌కు స్పందించవద్దని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నకిలీ అరెస్ట్‌ వారెంట్లు చూపుతూ..

సైబర్‌ నేరగాళ్లు చట్టపరిధిలో పనిచేసే కస్టమ్స్‌ విభాగం, సీబీఐ లేదా ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారుల్లా అవతారమెత్తి అమాయకులకు వీడియో కాల్స్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌, స్కైప్‌ల ద్వారా వీడియో కాల్స్‌ చేస్తారు. నకిలీ అరెస్ట్ట్‌ వారెంట్‌ చూపుతూ మానసికంగా వేధింపులకు గురిచేస్తారు. ట్యాక్స్‌ ఎగ్గొడుతున్నారని, లావాదేవీల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందంటారు.


city6.3.jpg

ఈ బెదిరింపులు ఫోన్‌ కాల్‌ ద్వారా, ఈ మెయిళ్ల ద్వారా, మెసేజీల ద్వారా కొనసాగుతున్నాయి. భయాన్ని కల్పించి, ఆందోళనలోకి నెట్టి డబ్బు దండుకుంటున్నారు. సైబర్‌ మోసగాళ్లు చాకచక్యంగా మాట్లాడుతూ, అమాయకుల్లో భయాన్ని సృష్టిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారు. ఆందోళనకు గురిచేస్తూ భయపెట్టడమే వారి ఆ యుధం. బ్యాంక్‌ ఖాతాలు, లావాదేవీలు, క్రెడిట్‌కార్డుల వివరాలు, వ్యక్తిగత సమాచారం కూడా సేకరిస్తారు. మీ కేసు దర్యాప్తులో నేర పరిశోధనలో మీ పేరు లేకుండా చేస్తామని, రిఫండబుల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌/ఎస్ క్రో అకౌంట్‌ ముసుగులో డబ్బు దోచుకుంటున్నారు.


ఖాతాలు, వ్యక్తిగత వివరాలు షేర్‌ చేయొద్దు

పాన్‌ నంబర్‌, బ్యాంక్‌ ఖాతాలు, తదితర వ్యక్తిగత వివరాలు షేర్‌ చేయొద్దు. దేశంలో ఈ ఏడాది 92,323 డిజిటల్‌ అరెస్ట్‌ కేసుల్లో సైబర్‌ మోసగాళ్లు రూ. 2,140 కోట్లు దోచుకున్నారు. సైబర్‌ మోసగాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి లేదా విదేశాల నుంచి మోసాలు చేస్తున్నారు. సైబర్‌ నేర పరిశోధనలో ఆయా ప్రాంతాలను కనుగొనడం కష్టసాధ్యమవుతుంది. అపరిచితుల నుంచి వచ్చే ఎలాంటి కాల్స్‌కూ స్పందించవద్దు. ఆర్థిక మోసాలు, సైబర్‌ క్రైమ్‌, సమాచారం తదితర నేరాలపై నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయవచ్చు. పోలీసులు డబ్బు బదిలీ చేయమని, డిపాజిట్‌ చేయమని చెప్పరు.

- జి.సుధీర్‌బాబు, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, రాచకొండ కమిషనరేట్‌


వెబ్‌సైట్లు, లింక్‌లపై క్లిక్‌ చేయొద్దు

సైబర్‌ నేరాలను ఛేదించడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. గుర్తు తెలియని వెబ్‌సైట్లపైన, లింక్‌లపైనా క్లిక్‌ చేయొద్దు. అపరిచితులు సంప్రదిస్తే స్పందించవద్దు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మారుతున్న స్థితిగతులను గమనిస్తున్న వారు, అవగాహన ఉన్న వారు మిగతా వారందరికీ సైబర్‌ నేరాల తీరుపై సమాచారం ఇవ్వండి. సైబర్‌ నేరాలు, నివారణ, ప్రస్తుత తదితర అంశాలపై మరింత సమాచారం కోసం dn.isea.app వెబ్‌సైట్‌కు లాగ్‌ఆన్‌ కావచ్చు.

- సీహెచ్‌ఏఎస్‌ మూర్తి, సీనియర్‌ డైరెక్టర్‌, సీ డాక్‌ హైదరాబాద్‌


ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్‌ ఏ1

ఈవార్తను కూడా చదవండి: HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!

ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!

ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2024 | 10:04 AM