Hyderabad: రాష్ట్రానికి వెయ్యి కోట్ల పెట్టుబడులు..
ABN , Publish Date - Jul 26 , 2024 | 06:32 AM
రక్షణరంగ పరికరాల ఉత్పత్తి సంస్థ ‘వెమ్ టెక్నాలజీస్’ రాష్ట్రంలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆ సంస్థ సీఎండీ వి.వెంకటరాజు, ప్రతినిధులు గురువారం సచివాలయంలో ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశమయ్యారు.
నిమ్జ్‌లో రక్షణ పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని
ఏర్పాటు చేయనున్న ‘వెమ్ టెక్నాలజీస్’
మంత్రి శ్రీధర్‌బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రక్షణరంగ పరికరాల ఉత్పత్తి సంస్థ ‘వెమ్ టెక్నాలజీస్’ రాష్ట్రంలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆ సంస్థ సీఎండీ వి.వెంకటరాజు, ప్రతినిధులు గురువారం సచివాలయంలో ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. జహీరాబాద్ నిమ్జ్‌లో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ మొదటి దశలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. ఇదివచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందని, తొలిదశలో వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉద్యో గాలు లభిస్తాయని చెప్పారు. పరిశ్రమకు కావాల్సిన భూమిని వెంటనే సమీకరించి ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి శ్రీధర్‌బాబు సూచించారు.
ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన 33 కేవీ విద్యుత్తు లైన్లను 4 నెలల్లో ఏర్పాటు చేసి సరఫరా ప్రారంభించాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఈవో మధుసూదన్, ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, జపనీస్ పెట్రో కెమికల్ దిగ్గజం ‘మిత్సుయి కెమికల్స్’ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. సంస్థ గ్లోబల్ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్ ఫ్యూజి ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గురువారం మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయింది. టీహబ్ ద్వారా లైఫ్‌సైన్సెస్, పెట్రో కెమికల్స్ రంగాల్లోని అంకుర సంస్థల్లో 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధి హన్మంతరావు తెలిపారు.
ప్రభుత్వరంగ సంస్థలను అమ్మితే ఊరుకోం: శ్రీధర్ బాబు
ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా ఈ ఏడాది రూ.50 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రస్తావిం చడం పై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. ఇది కన్నబిడ్డలను మరొకరికి అమ్ముకోవడం లాంటి దారుణమన్నారు. 13 మహారత్న, 14 నవరత్న, 72 మినీరత్న సంస్థలన్నీ లా భాల్లో ఉన్నాయని.. వాటిని అమ్మితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.