Share News

Apology: స్మితా సబర్వాల్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:39 AM

దివ్యాంగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితాసబర్వాల్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని నమో దివ్యాంగ్‌ క్యాంపెయినింగ్‌ భారత్‌, డిసేబుల్డ్‌ హెల్ప్‌లైన్‌ ఫౌండేషన్‌ జాతీయ కన్వీనర్‌ వికా్‌సశర్మ డిమాండ్‌ చేశారు.

Apology: స్మితా సబర్వాల్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి

  • నమో దివ్యాంగ్‌ క్యాంపెయినింగ్‌ భారత్‌

న్యూఢిల్లీ, జూలై 25(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితాసబర్వాల్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని నమో దివ్యాంగ్‌ క్యాంపెయినింగ్‌ భారత్‌, డిసేబుల్డ్‌ హెల్ప్‌లైన్‌ ఫౌండేషన్‌ జాతీయ కన్వీనర్‌ వికా్‌సశర్మ డిమాండ్‌ చేశారు. ఆమె చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకు దివ్యాంగుల తరపున కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.


ఈ మేరకు గురువారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్మిత ట్వీట్లు దివ్యాంగుల పట్ల ఆమె చులకనభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న స్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమా? లేదా ప్రభుత్వ అభిప్రాయమా? అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - Jul 26 , 2024 | 05:39 AM