Share News

DGP Jitender: 6 నెలల్లో రూ.84.3 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం: డీజీపీ

ABN , Publish Date - Aug 04 , 2024 | 05:30 AM

ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ జితేందర్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో రూ.84.3 కోట్లు విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు.

DGP Jitender: 6 నెలల్లో రూ.84.3 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం: డీజీపీ

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ జితేందర్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో రూ.84.3 కోట్లు విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం 938 కేసులు నమోదు చేసి ఆయా కేసులతో సంబంధమున్న 1,921 మంది నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. అత్యధికంగా గంజాయికి సంబంధించి 816 కేసులు నమోదు చేసి.. 1,649 మందిని అరెస్ట్‌ చేశామన్నారు.


డ్రగ్స్‌కు సంబంధించిన 5 కేసుల్లో నిందితులకు చెందిన రూ.47.16 కోట్లు విలువైన ఆస్తులు అటాచ్‌ చేసినట్లు ‘ఎక్స్‌’ వేదికగా వివరించారు. మరోవైపు.. డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తుపదార్థాల వాడకం వల్ల ఎదురయ్యే ఇబ్బందులపై తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య నేతృత్వంలో పాఠశాలల నుంచి కళాశాలల వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Updated Date - Aug 04 , 2024 | 05:30 AM