JNTU: వరంగల్ వాసికి మాంచెస్టర్ వర్సిటీ అవార్డు
ABN , Publish Date - Sep 20 , 2024 | 04:40 AM
జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థి, వరంగల్ జిల్లా తీగరాజుపల్లికి చెందిన డాక్టర్ గౌతమ్ సొల్లేటికి యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి బెస్ట్ ఔట్ స్టాండింగ్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అవార్డు లభించింది.
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థి, వరంగల్ జిల్లా తీగరాజుపల్లికి చెందిన డాక్టర్ గౌతమ్ సొల్లేటికి యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి బెస్ట్ ఔట్ స్టాండింగ్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అవార్డు లభించింది. కృత్రిమ అయాన్ చానల్స్ తయారీపై ఆయన చేసిన పరిశోధనలకుగాను ఈ గుర్తింపు లభించింది. యూనివర్సిటీ ఏర్పాటై 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వర్సిటీలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో గౌతమ్ ఈ అవార్డు అందుకున్నారు.
జేఎన్‌టీయూ నుంచి నానో టెక్నాలజీలో ఎంఎస్సీ పూర్తి చేసిన గౌతమ్.. జేఎన్‌టీయూ ప్రస్తుత రిజిస్ట్రార్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ చేశారు. అనంతరం పోస్ట్ డాక్టోరల్ పోగ్రామ్ కోసం మాంచెస్టర్ యూనివర్సిటీకి వెళ్లి ‘2డీ మెటీరియల్ నానో ఫ్లూయిడిక్స్’ అంశంపై పరిశోధన చేసి విలువైన ఫలితాలను కనుగొన్నారు. గౌతమ్ చేసిన పరిశోధనకు సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత ’నేచర్‘ జర్నల్‌లో ఆర్టికల్ కూడా ప్రచురితమైంది.