TS DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Feb 29 , 2024 | 11:38 AM
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రేవంత్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkata Reddy), ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) హాజరయ్యారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రేవంత్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
AP Elections: ‘ఫ్యాను’ పార్టీ పాడుపని.. చీ.. ఛీ.. ఇంత దిగజారాలా జగన్..?
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం 5,089 పోస్టులతో 2023 సెప్టెంబరు 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. అయితే గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేశారు. గత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన అనంతరం.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. వీటితో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది.
Madhya Pradesh: వొద్దంటే వెళ్లిపోతా.. కమల్ నాథ్ షాకింగ్ కామెంట్స్..
కాగా, కొత్త పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారన్న ప్రచారం జరిగినా.. మొత్తం పోస్టులకు కలిపి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఇటీవల గ్రూపు-1 పోస్టుల భర్తీలోనూ గత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీచర్ పోస్టుల విషయంలోనూ ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరించింది. అయితే గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులెవరూ మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంది. కొత్త అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
YSRCP: పవన్ అన్నదేంటి? ప్రచారం చేస్తున్నదేంటి? దీనికంటే దిగజారుడు మరొకటి ఉంటుందా?
పోస్టుల వివరాలు..
11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎస్జీటీలు 6,508, స్కూల్ అసిస్టెంట్లు 2,629, ఎల్పీ 727, పీఈటీ 182 . దీంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220లు, ఎస్జీటీలు 796 పోస్టులున్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకూ డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
TDP: ఉండి టీడీపీ అసెంబ్లీ టికెట్ వివాదం కొలిక్కి వచ్చేనా..?
Mudragada: అన్నీ మరచి మీతో ప్రయాణానికి సిద్ధపడ్డా కానీ.. పవన్‌కు ముద్రగడ లేఖ
AP News: సీఎం క్యాంపు కార్యాలయానికి ఐఏఎస్ అధికారి ఇంతియాజ్..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.