Duddilla Sridhar Babu: భట్టి ఏనాడూ చెప్పుకోలేదు!
ABN , Publish Date - Aug 01 , 2024 | 03:09 AM
‘‘డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏనాడూ తన సామాజిక వర్గం పేరు చెప్పుకోలేదు.. వాడుకోలేదు.
ఆయన బాధ అర్థమవుతోంది: దుద్దిళ్ల
హైదరాబాద్, జూలై 31(ఆంధ్రజ్యోతి): ‘‘డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏనాడూ తన సామాజిక వర్గం పేరు చెప్పుకోలేదు.. వాడుకోలేదు. కానీ నిండు సభలో తాను దళితుడిననే పదం వాడారంటే ఆయన ఎంత బాధతో మాట్లాడారో అర్థం అవుతుంది’’ అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ లాబీలో బుధవారం దుద్దిళ్ల మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయంపై ఐదేళ్ల తర్వాత మొదటి సారి భట్టి నోరు విప్పారని పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.