Hyderabad: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. భారీగా నగదు సీజ్..
ABN , Publish Date - Dec 20 , 2024 | 08:15 PM
భాగ్యనరంలో ఈడీ రైడ్స్ కలకలం రేపింది. నగర వ్యాప్తంగా 8 చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఫైనాన్సియర్ల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు అధికారులు.
హైదరాబాద్, డిసెంబర్ 20: భాగ్యనరంలో ఈడీ రైడ్స్ కలకలం రేపింది. నగర వ్యాప్తంగా 8 చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఫైనాన్సియర్ల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు అధికారులు. వీరి వద్ద నుంచి రూ. 80 లక్షల వరకు నగదు సీజ్ చేసినట్లు సమాచారం. దీంతోపాటుగా ఫైనాన్సియర్ల ఇళ్లలో ఐదున్నర కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు సైతం ఈడీ అధికారులు సీజ్ చేశారు. సురేష్ అగర్వాల్, రక్షిత అగర్వాల్, సీఎస్‌కే రియల్టర్ ఇళ్లలో ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ జరుగుతోందని సమాచారం అందుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. ఒక్కసారిగా ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు. ఈడీ సోదాలు హైదరాబాద్ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహారం ఈడీ ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో.. ఇవాళే హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించడం.. వేరే అనుమానాలకు తావిస్తున్నాయి.