Egg: కోడిగుడ్డు కొండెక్కింది..
ABN , Publish Date - Dec 18 , 2024 | 01:58 PM
కోడి గుడ్డు ధర కొండెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. చలికాలంలో ధరలు పెరగటం సాధారణమే అయినా ఈస్థాయిలో పెరిగిన దాఖలాలు లేవని వ్యాపారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
- హోల్‌సేల్ ధర రూ.7పైన.. రిటైల్ రూ.8
అశ్వారావుపేట(ఖమ్మం): కోడి గుడ్డు ధర కొండెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. చలికాలంలో ధరలు పెరగటం సాధారణమే అయినా ఈస్థాయిలో పెరిగిన దాఖలాలు లేవని వ్యాపారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పెరిగిన ధరలతో గుడ్డు ప్రియులకు గుడ్డు కొనుగోలు భారంగా మారింది. కొద్దిరోజుల్లో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ఉన్నాయి. వేడుకలకు అవసరమైన కేక్‌ల తయారీలోనూ కోడి గుడ్ల వినియోగం భారీగానే ఉంటుంది. దీంతో వ్యాపారులు ఇబ్బంది పడే పరిస్థితి. పండుగలు ఉన్నందున ధరలు ఇదేమాదిరిగా ఉండే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్.. పెరిగిన పుష్ప కలెక్షన్లు.. ఎంపీ కీలక వ్యాఖ్యలు
ఇక నిత్యం పాఠశాలల్లో, గురుకులాల్లో, ఆశ్రమాల్లో కోడిగుడ్లు వినియోగం ఉంటుంది. పెరిగిన ధరల ప్రభావం మధ్యాహ్న భోజనంపైనా పడే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాలుగు నెలల క్రితం రూ.5 వరకు ఉన్న ప్రస్తుతం హోల్‌సేల్‌గానే రూ.7పైన పలుకుతోంది. ఆగస్టు నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన ధర డిసెంబరు నాటికి భారీగా పెరిగింది. హోల్‌సేల్ వ్యాపారులు 30 గుడ్ల అట్టను రూ.210కి విక్రయిస్తుంటే దానిని కొనుగోలు చేసే చిరువ్యాపారులు ఒక్కో గుడ్డును రూ.8వరకు విక్రయిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం
ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి
Read Latest Telangana News and National News