Home » Egg Rate Hike
కోడి గుడ్డు ధర కొండెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. చలికాలంలో ధరలు పెరగటం సాధారణమే అయినా ఈస్థాయిలో పెరిగిన దాఖలాలు లేవని వ్యాపారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
హైదరాబాద్‍లో కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో వాటి ధర అమాంతంగా పెరిగిపోయాయి. ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 7 పలుకుతోంది. ఇక సూపర్ మార్కెట్‍లో వీటి ధర రూ. 10గా విక్రయిస్తున్నారు.
చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, కోళ్ల ఆరోగ్య ప్రభావితం కావడం, కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడం, న్యూయర్ వేడుకల సందర్భంగా కేకుల వినియోగం పెరగడం వంటి పలు కారణాలతో రేట్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనూ వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కోడి గుడ్డు రేట్లు కొండెక్కి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
కార్తికమాసం వెళ్లిపోయింది. చికెన్ ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి.
రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. చలికాలంలో గుడ్డు వినియోగం పెరగడం, క్రిస్మస్, నూతన సంవత్సవ సందర్భంగా కేకుల తయారీకి గుడ్లను పెద్దఎత్తున వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో రేట్లు మరింత పెరిగి ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది.
కోడి గుడ్డు (Egg) ధర కొండెక్కింది. దీంతో సామాన్యులు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ పక్క బహిరంగ మార్కెట్లో కూరగాయలు ధరలు మండిపోతుంటే కోడి గుడ్ల ధరలు సైతం..