LokSabha Elections: తెలంగాణలో కొన్ని గంటల్లో పోలింగ్..
ABN , Publish Date - May 11 , 2024 | 08:04 PM
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మే 13వ తేదీ అంటే.. సోమవారం రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలతోపాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల విధుల్లో మొత్తం 2 లక్షల 91 వేల మంది సిబ్బందిని పాల్గొనున్నారు.
హైదరాబాద్, మే 11: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మే 13వ తేదీ అంటే.. సోమవారం రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలతోపాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల విధుల్లో మొత్తం 2 లక్షల 91 వేల మంది సిబ్బందిని పాల్గొనున్నారు.
అందుకోసం 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పార్లమెంట్ సిగ్మెంట్‌లో 3 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో సాయింత్రం 4.00 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల పోలింగ్‌కు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.
AP Elections: కొన్ని గంటల్లోనే అసలు ఘట్టం ప్రారంభం
ఏప్రిల్ 18న తొలి నామినేషన్ దాఖలు అయింది. అలా అభ్యర్థుల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇక ఎన్నికల ప్రచారంతో రాజకీయ పార్టీల నేతలు తమ ప్రచారాన్ని హోరెత్తించారు. ఆ క్రమంలో బీజేపీ తరపున ఆ పార్టీ కీలక నేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు సైతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్ మంత్రులు సైతం ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సైతం తన ప్రచారాన్ని చేపట్టింది. ఆ పార్టీ తరఫున మాజీ సీఎం కేసీఆర్.. బస్సు యాత్ర చేపట్టారు. ఇక తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. తమ అభ్యర్థులను బరిలో దింపాయి.
LokSabha Elections: మోదీ రిటైర్ అవుతున్నారు.. మీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు..?
మరోవైపు ఎంఐఎం నుంచి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగారు. అయితే ఆ స్థానంలో ఎలాగైనా బీజేపీ జెండా ఎగరేయాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో సదరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాధవి లతను బరిలో దింపింది.
Elections: ప్రయాణికులతో నిండిపోయిన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
LokSabha Elections: తనయుడి భవిష్యత్తుపై స్పందించిన మేనకా గాంధీ
ఇక గతేడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఓటరు పట్టం కట్టారు. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత.. బరిలో నిలిచి గెలిచారు. ఆ కొద్ది రోజులకే కారు ప్రమాదంలో ఆమె మరణించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి.
Read Latest National News And Telugu News