Chocolates: రెగ్యులర్‌గా మీ పిల్లలు ఇలాంటి చాక్లెట్స్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..
ABN , Publish Date - Jan 30 , 2024 | 07:57 PM
చాక్లెట్లు, బిస్కెట్లు కనపడితే లొట్టలేసుకుంటూ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే. కొన్నిసార్లు పైకి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. నిశితంగా పరిశీలిస్తే షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తుంటాయి. రోజురోజుకూ..
చాక్లెట్లు, బిస్కెట్లు కనపడితే లొట్టలేసుకుంటూ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే. కొన్నిసార్లు పైకి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. నిశితంగా పరిశీలిస్తే షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తుంటాయి. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కొందరు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ దురాశ చివరకు చిన్న పిల్లలు తినే చాక్లెట్లను కూడా కల్తీ చేసే వరకూ వెళ్లింది. పైకి చూస్తే అవి అందమైన చాక్లెట్లే.. కానీ లోపల పరిశీలిస్తే దిమ్మదిరిగే దృశ్యం కనపడుతుంది. తాజాగా, హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ (Hyderabad) నగర పరిధి కోకాపేట్లో నయా దందా వెలుగులోకి వచ్చింది. గంజాయిని చాక్లెట్ల (ganja chocolates) రూపంలో విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిస్సాకు చెందిన సౌమ్యా రాజన్ అనే వ్యక్తి స్థానిక ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో కార్మికులకు చాక్లెట్లు విక్రయిస్తూ కనిపించాడు. సమాచారం అందుకున్న అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కోకాపేట్ రాంకీ కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ గదిలో వివిధ బ్రాండ్స్‌కు చెందిన గంజాయి చాక్లెట్స్ ఉన్నట్లు గుర్తించారు. సౌమ్యా రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Viral Video: పట్టపగలే యువతికి షాక్ ఇచ్చిన పక్షి.. అంతా చూస్తుండగా.. పర్సు కొట్టేసి.. చివరకు..
గంజాయి చాక్లెట్లను ఒడిస్సా నుంచి తెచ్చి.. హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు రోజు కూలీలకూ ఈ చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిని ఒడిస్సాలో తక్కువ ధరకు కొనుక్కుని, హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. సోమవారం ఉప్పల్ పరిధి రామంతపూర్‌లో గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గాంధీ నగర్లో కిరాణ దుకాణం నిర్వహిస్తున్న ఫిరోజ్ జెనా ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసి, 34 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకుంటుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Viral Video: సింహానికి చిక్కిన గేదెల మంద.. దొరికిపోతాయనుకున్న సమయంలో ఒక్కసారిగా సీన్ రివర్స్..