Viral Video: వామ్మో! చివరకు ఇలా అయ్యిందేంటీ.. గడ్డకట్టే చలిలో వేడి వేడి న్యూడిల్స్‌తో వింత ప్రయోగం..
ABN , Publish Date - Jan 28 , 2024 | 04:21 PM
చలికాలంలో ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నిసార్లు చలితీవ్రతకు ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టాలనే భయపడుతుంటారు. ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక...
చలికాలంలో ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నిసార్లు చలితీవ్రతకు ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టాలనే భయపడుతుంటారు. ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ఏడాది పొడవునా మంచు కురిసే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాసేపు బయట నిలబడితే చాలు.. గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఘటనలకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. గడ్డ కట్టే చలిలో ఓ వ్యక్తి వింత ప్రయోగం చేశాడు. వేడి వేడి న్యూడిల్స్‌ను మంచులో ఉంచడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గడ్డ కట్టే చలిలో ఓ వ్యక్తికి వింత సందేహం వచ్చింది. చలి తీవ్రత ఎలా ఉందో కనుక్కునేందుకు ఓ ప్రయోగం చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం అతను వేడి వేడి న్యూడిల్స్ (Noodles) తీసుకున్నాడు. స్టవ్ మీద ఉడుకుతున్న న్యూడిల్స్‌ను ఇంటి బయటికు తీసుకెళ్లి.. మంచు గడ్డపై పెట్టాడు. ఇంకేముందీ.. చూస్తుండగానే కాసేపటికే పొగలు పూర్తిగా చల్లారిపోయి.. (Noodles frozen in ice) ఆశ్చర్యకరంగా గడ్డకట్టుకుపోయాయి.
ఈ 10 పక్షులు యమా డేంజర్.. పాములను కూడా తినగలవు..
న్యూడిల్స్ మంచులో ఉంచే ముందు.. ఓ ఆకారం వచ్చేలా స్పూన్‌తో న్యూడిల్స్‌ను పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా పెడతాడు. కాసేపు ఆగి వెళ్లి చూస్తే న్యూడిల్స్ మొత్తం గడ్డకట్టుకుపోయి.. చూసేందుకు ఓ అందమైన శిల్పంలా మారాయి. వాటికి స్పూన్ కూడా అతుక్కుపోయింది. తీద్దామని ఎంత ప్రయత్నించినా స్పూన్ బయటికి రాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఆ స్థానంలో మనిషి ఉంటే పరిస్థితి ఏంటో’’.. అంటూ కొందరు, ‘‘న్యూడిల్స్ చాలా అందంగా మారిపోయాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: రోడ్డుపై రిక్షాను చూసి పరుగెత్తుకుంటూ వెళ్లిన పోలీసు.. చివరకు ఎంత పని చేశాడంటే..