Share News

Engineering seats: ఇంజనీరింగ్‌ సీట్లకు టాపర్లు దూరం!

ABN , Publish Date - Jul 20 , 2024 | 03:48 AM

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ సీట్లలో చేరేందుకు టాపర్లు ఆసక్తి చూపడం లేదు. ఎప్‌సెట్‌లో 100లోపు ర్యాంకు పొందిన వారిలో ఒక్కరు, 200 లోపు ర్యాంకులు వచ్చిన వారిలో ఇద్దరు, 500లోపు ర్యాంకులు సాధించిన వారిలో 12 మంది, వెయ్యిలోపు ర్యాంకులు వచ్చిన వారిలో 86 మంది మాత్రమే ఇక్కడ సీట్లలో చేరేందుకు అనుకూలంగా ఉన్నారు.

Engineering seats: ఇంజనీరింగ్‌ సీట్లకు టాపర్లు దూరం!

  • ఐఐటీ, ఎన్‌ఐటీల వైపు ఎప్‌సెట్‌ టాప్‌ ర్యాంకర్లు

  • వెయ్యి లోపు ర్యాంకర్లకు.. 86 మంది మాత్రమే రాష్ట్రంలో చేరేందుకు ఆసక్తి

  • ఎప్‌సెట్‌ తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తి

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ సీట్లలో చేరేందుకు టాపర్లు ఆసక్తి చూపడం లేదు. ఎప్‌సెట్‌లో 100లోపు ర్యాంకు పొందిన వారిలో ఒక్కరు, 200 లోపు ర్యాంకులు వచ్చిన వారిలో ఇద్దరు, 500లోపు ర్యాంకులు సాధించిన వారిలో 12 మంది, వెయ్యిలోపు ర్యాంకులు వచ్చిన వారిలో 86 మంది మాత్రమే ఇక్కడ సీట్లలో చేరేందుకు అనుకూలంగా ఉన్నారు. ఎప్‌సెట్‌ టాప్‌ ర్యాంకర్లు ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి సంస్థల్లో సీట్లు సాధించారు. అందుకే వారు ఇక్కడ సీట్లలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా శుక్రవారం మొదటి దశ సీట్ల కేటాయింపు జరిగింది. కన్వీనర్‌ కోటాలో మొత్తం 78,694 ఇంజనీరింగ్‌ సీట్లు ఉండగా 75, 200 సీట్లు భర్తీ అయ్యాయి. 3,494 సీట్లు మిగిలిపోయాయి.


ప్రభుత్వ కళాశాలల్లో 95.9 శాతం, ప్రభుత్వ యూనివర్సిటీల్లో 89.1 శాతం, ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 99.6 శాతం, ప్రైవేట్‌ కళాశాలల్లో 96 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 6,038 మంది అభ్యర్థులు ఈడబ్ల్యుఎస్‌ కోటా కింద సీట్లను పొందారు. వెబ్‌ ఆప్షన్లలో పాల్గొన్న వారిలో 20,535 మందికి సీట్లు లభించలేదు. ప్రస్తుతం సీట్లు పొందిన వారు ఈనెల 23లోపు కళాశాలల్లో ఫీజును చెల్లించి, రిపోర్ట్‌ చేయాలి. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు కంప్యూటర్‌ బేస్డ్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల వైపే మొగ్గు చూపారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ అనుబంధ కోర్సుల్లో 99.31 శాతం, ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్ర్టికల్‌ కోర్సుల్లో 92.55 శాతం, సివిల్‌, మెకానికల్‌ అనుబంధ కోర్సుల్లో 77.52 శాతం, ఇతర కోర్సుల్లో 77.34 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.


ఎప్‌సెట్‌ ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్‌

సీట్లు పొందిన విద్యార్థుల వివరాలు...

ర్యాంకు సీట్లు పొందిన

విద్యార్థులు

0 నుంచి 100 1

101 నుంచి 200 1

201 నుంచి 500 10

501 నుంచి 1,000 74

1,001 నుంచి 5,000 1,822

5,001 నుంచి 10,000 2,945

10,001 నుంచి 20,000 5,809

20,001 నుంచి 30,000 5,878

30,001 నుంచి 40,000 5,878

40,001 నుంచి 50,000 5,623

50,001 నుంచి 1,00,000 22,964

Updated Date - Jul 20 , 2024 | 03:48 AM