Share News

Medak: అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య..

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:22 AM

వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోయి.. .జీవితంపై విరక్తితో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం రామాయిపల్లిలో రైతు బత్తుల రాజు (40) అప్పులు చేసి బోర్లు వేయగా ఫలితం దక్కలేదు.

Medak: అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య..

  • విద్యుదాఘాతంతో రైతు మృతి

కొల్చారం, వెల్దుర్తి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోయి.. .జీవితంపై విరక్తితో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం రామాయిపల్లిలో రైతు బత్తుల రాజు (40) అప్పులు చేసి బోర్లు వేయగా ఫలితం దక్కలేదు. దీంతో సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు నిండు ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన మెదక్‌ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట శివారులో సోమవారం జరిగింది.


గ్రామానికి చెందిన రైతు మెట్టు మల్లయ్య(60) తన వ్యవసాయ భూమి వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్‌ వైర్‌ లేకపోవడంతో విద్యుత్‌ అధికారులకు సమాచారమిచ్చి వైర్‌ వేయడానికి ఉపక్రమించాడు. ఇదే సమయంలో విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు చనిపోయాడని స్థానికులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 24 , 2024 | 05:22 AM